జాతీయ వార్తలు

అలా చేస్తే.. ఆలస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: ఓట్ల లెక్కింపులో మొదట ప్రతి నియోజకవర్గంలోని ఎంపిక చేసిన ఐదు పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో పోల్చి ధ్రువీకరించుకున్న తరువాతే మొత్తం ఈవీఎంల ఓట్లను లెక్కించాలన్న 22 ప్రతిపక్ష పార్టీల డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా నాయకత్వంలో ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘం బుధవారం ఉదయం సమావేశమై ప్రతిపక్ష పార్టీల డిమాండ్‌ను తిరస్కరించాలని అధికారికంగా నిర్ణయించటంతోపాటు ఈ అంశాన్ని అధికారికంగా ప్రకటించింది. సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లవాసా, సుశీల్ చంద్ర ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, వామపక్షాలు, ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే తదితర ప్రతిపక్ష పార్టీల నాయకులు బుధవారం ఎన్నికల సంఘాన్ని కలిసి వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించిన తరువాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈవీఎంల పట్ల ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేందుకు తాము చెప్పిన విధంగా చేయాలని ప్రతిపక్ష నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించారు. ఈ సూచనను సునీల్ అరోరా తిరస్కరించినా ఎన్నికల సంఘం ఫుల్‌బెంచ్ సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్షాల డిమాండ్‌పై చర్చించారు. దాదాపు అరగంట చర్చ అనంతరం ప్రతిపక్షాల డిమాండ్‌ను తిరస్కరించాలని నిర్ణయించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదట వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో పోల్చి ధ్రువీకరించిన తరువాత మొత్తం ఈవీఎంల ఓట్ల లెక్కింపు చేపట్టడం ద్వారా మొత్తం లెక్కింపు ప్రక్రియలో తీవ్రమైన జాప్యం చోటు చేసుకుంటుందని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. వీవీప్యాట్ స్లిప్పుల ధ్రువీకరణ జరగటంలో ఏమాత్రం ఆలస్యమైనా దానివలన మొత్తం లెక్కింపు ప్రక్రియ దెబ్బతింటుందని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపక్షాల డిమాండ్‌ను తిరస్కరించింది. వీవీప్యాట్ స్లిప్పులను ఆఖరున ఈవీఎంలతో పోల్చి ధ్రువీకరిస్తారని వారు స్పష్టం చేశారు.
సుప్రీం ఆదేశాలు బేఖాతరు: ఏచూరి
వీవీ ప్యాట్ స్లిప్‌లను లెక్కించడంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) బేఖాతరు చేసిందని సీపంఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. ఓట్ల లెక్కిపు సమయంలో వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంతో ఆరంభంలోనే పోల్చి చూడాలన్న 22 పార్టీలు చేసిన ప్రతిపాదనను ఈసీ తోసిపుచ్చడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది ముమ్మాటికీ సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. తాము చేసిన ప్రతిపాదనలను ఈసీ తిరస్కరించడానికి కారణమేమిటని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోరా అని నిలదీశారు.