జాతీయ వార్తలు

ఈ ప్రయోగం.. సమష్టి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 22: పీఎస్‌ఎల్‌వీ-సీ 46 ప్రత్యేకమైన ప్రయోగమని ఇది చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ అన్నారు. బుధవారం షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 46 విజయవంతంగా ప్రయోగించిన అనంతరం ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి నేరుగా మాట్లాడుతూ దేశ అవసరాల నిమిత్తం ఇస్రో అనేక ఉపగ్రహ ప్రయోగాల చేపడుతుందన్నారు. అందులో భాగంగా దేశ రక్షణ రంగంతో పాటు వ్యవసాయం, అటవీ ప్రాంతాలకు కూడా సహాయపడే విధంగా రీశాట్-2బి ఉపగ్రహాన్ని రూపొందించామన్నారు. షార్‌లో వరుస విజయాల వెనుకు శాస్తవ్రేత్తల సమష్టి కృషేనని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇది మూడో ప్రయోగం కాగా హ్యాట్రిక్ విజయంగా ఆయన అభివర్ణించారు. అనుకొన్న విధంగా ఉపగ్రహం గురితప్పకుండా కక్ష్యలోకి చేరిందన్నారు. చివరిలో ఉపగ్రహం విడిపోయే సమయంలో నిర్ధేశించిన కక్ష్యకు చేరేందుకు 0.02మీటర్ల దూరం చేరాల్సి ఉందని దానిని శాస్తవ్రేత్తలు ఆపరేషన్ చేసే సమయంలో చేర్చుతామన్నారు. ఈ ప్రయోగం ఇస్రో చరిత్రలో గొప్ప ప్రయోగమన్నారు. ఇక పై ఇదే తరహా మరిన్ని ప్రయోగాలు ఉంటాయన్నారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా ఇప్పటి వరకు 353 ఉపగ్రహాలను రోదసీలోకి పంపామన్నారు. అవి కూడా సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఇందులో 47 స్వదేశీ ఉపగ్రహాలు ఉన్నాయన్నారు. జూలై 9వ తేదీ నుంచి 16వ తేదీలోపుచంద్రయాన్-2 కీలక ప్రయోగం ఉంటుందన్నారు. అదే విధంగా పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలతో పాటు ఈ ఏడాది రెండు జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాలు ఉంటయాని వెల్లడించారు. జీఎస్‌ఎల్‌వీ ద్వారా ఎఫ్ 10, ఎఫ్ 11 ఉపగ్రహాలు పంపుతామన్నారు. ఉపగ్రహ డైరెక్టర్ నాడగౌడ మాట్లాడుతూ ఇది ఒక చారిత్రాత్మక ప్రయోగమని దీని సేవలు దేశ రక్షణ రంగానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఈ ఉపగ్రహాన్ని తక్కువ కాల వ్యవధిలోనే రూపకల్పన చేసి ప్రయోగించామన్నారు. పీఎస్‌ఎల్‌వీ ఇస్రోకు గురితప్పని బాణమని అందువల్లే గొప్ప విజయాలు అందిస్తున్నాయన్నారు. షార్ డైరెక్టర్ ఎస్ పాండ్యన్ మాట్లాడుతూ విదేశాలు కూడా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపేందుకు ఆసక్తికనబరుస్తున్నారని తెలిపారు. రాబోయే కాలమంతా బీజీ షెడ్యూలని ఇక షార్ నుంచి ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్ ఎస్ సోమనాద్, ఎల్‌పిఎస్‌పీ డైరెక్టర్ కె నారాయణ, ఐపీఆర్‌సీ డైరెక్టర్ కె మూకయ్య, మిషన్ డైరెక్టర్ ఎస్‌ఆర్ బిజు, యుఆర్‌ఎస్‌సీ డైరెక్టర్ పి కున్హికృష్ణన్, శాస్తవ్రేత్తలు శ్యామ్ దయాల్ దేవ్, డీకే దాస్ తదితరులు పాల్గొన్నారు.