జాతీయ వార్తలు

ఇది నాకో గట్టి దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 23: లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తన ఓటమిని అంగీకరించారు. అయితే, లౌకిక భారతం కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. జాతీయ పురస్కార గ్రహీత అయిన ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ పీసీ మోహన్, కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్‌లతో తలపడ్డారు. గురువారం కౌంటింగ్ కొనసాగుతుండగా ఒక దశలో మోహన్ 5.4 లక్షల ఓట్లతో అగ్ర స్థానంలో, అర్షద్ 4.9 లక్షల ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, ప్రకాశ్ రాజ్ కేవలం 25,881 ఓట్లతో మూడో స్థానంలో బాగా వెనుకబడి ఉన్నారు. దీంతో ప్రకాశ్ రాజ్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో తన ఘోర పరాజయాన్ని అంగీకరించారు. ‘ఇది నా ముఖంపై గట్టి దెబ్బ.. నేను వెళ్తున్న మార్గంలో ఎదురయిన అవమానం. అయినా నేను దృఢ వైఖరితో నిలబడతాను. లౌకిక భారతదేశం కోసం పోరాడాలన్న నా సంకల్పాన్ని కొనసాగిస్తాను’ అని ఆయన ట్వీట్ చేశారు. లౌకిక విలువల కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని పేర్కొంటూ, తనకు ఓటు వేసిన ప్రజలందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇప్పుడే మొదలయిన కష్టమయిన ప్రయాణం మున్ముందు ఇంకా ఉంటుంది. ఈ ప్రయాణంలో నాతో నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు..జై హింద్’ అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. 54 ఏళ్ల ప్రకాశ్ రాజ్ అంతకుముందు తాను మూడో స్థానంలో బాగా వెనుకబడి ఉన్నానని తెలుసుకొని కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే తన మద్దతుదారులతో కలిసి వెళ్లిపోయారు. ప్రకాశ్ రాజ్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతున్న ఒక వీడియోను ఒక ప్రముఖ కన్నడ దినపత్రిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.