జాతీయ వార్తలు

యూపీలో కలిసిరాని పొత్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 23: ఉత్తర్ ప్రదేశ్‌లో రెండు బలమైన ప్రాంతీయ పార్టీల అధిపత్యానికి తెర పడిందా?. తాజా లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ, ఆర్‌ఎల్‌డీ-బీఎస్పీ కూటమి పేలవమైన ఫలితాలను సాధించిన నేపథ్యంలో కుల సమీకరణలకు చెల్లు ఛీటీ పడినట్లుగానే స్పష్టమవుతోంది. బీజేపీ ప్రభావాన్ని అడ్డుకునేందుకు మాయావతి-అఖిలేష్, లోక్‌దళ్ పార్టీలు చేతులు కలిపినా నిరాశజనకమైన ఫలితాలే రావడం ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించిన బీజేపీని బలంగా నిలువరించాలన్న ఉద్దేశ్యంతో తాజా ఎన్నికలకు ముందే ఈ మూడు పార్టీలూ జత కట్టాయి. అయితే ఎంత గింజుకున్నా ఈ కూటమికి 20 సీట్లు దాటకపోవడంతో ఉత్తర ప్రదేశ్ ప్రజల ఓటింగ్ సరళిలో ప్రస్పుటమైన మార్పు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా తన ప్రాబల్యాన్ని చాటుకున్న మోదీ ఉత్తర ప్రదేశ్‌లోనూ కుల సమీకరణలకు చరమగీతం పాడారు. నిజానికి ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్‌వాది పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అయితే ఉమ్మడి ప్రత్యర్థి అయిన మోదీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలన్న సంకల్పంతోనే ఈ రెండు పార్టీలూ తమ వైరుధ్యాలను పక్కన పెట్టి చేతులు కలిపినా ప్రయోజనం లేకపోయింది. సమాజ్‌వాది పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ఆ పార్టీ బీఎస్పీతో చేతులు కలపడానికి ప్రధానంగా కారణమయ్యాయి. తాము కలిస్తే రాష్ట్రంలో 40 శాతానికి పైగా ఉన్న ఓబీసీ ఓట్లు, 21 శాతానికి పైగా ఉన్న దళిత ఓట్లు చేజిక్కుతాయని ఆ విధంగా అత్యథిక స్థాయిలో లోక్‌సభ సీట్లను గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పవచ్చని ఈ పార్టీలు భావించాయి. కానీ బీజేపీ సునామీ ముందు ఈ కుల లెక్కలు కొట్టుకుని పోయాయి. బీజేపీ మాత్రం యాదవేతర ఒబీసీ ఓట్లు, నాన్ జాతవ్ దళిత ఓట్లపైనే దృష్టి పెట్టింది. ఈ వర్గాలను అత్యంత చాకచక్యంగా తమ వైపు తిప్పుకుని ఎస్‌పీ, బీఎస్పీ కుల లెక్కలను దెబ్బతీసింది. ముఖ్యంగా ‘నా కులం పేద కులం’ అంటూ ఎన్నికల ప్రచారం చరమాంకంలో మోదీ విసిరిన బలమైన బాణం బీజేపీకి అన్ని విధాలా కలిసి వచ్చింది. అలాగే రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా చాలా బలమైన రీతిలో హిందుత్వ ప్రచారాన్ని కొనసాగించి కుల లెక్కలను మరింతగా నీరుగార్చారు. తాజా ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే ఇక యూపీలో కులాలను ఆకట్టుకునే లెక్కలకు ఆస్కారం ఉండదని, వీటి ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు కుదేలు కావడం ఖాయమన్న విషయం స్పష్టమవుతోంది. ఈ పొత్తు ద్వారా ఏ ప్రయోజానాన్ని అయితే మాయావతి, అఖిలేష్‌లు ఆశించారో అది ఏ కోశానా నెరవేరకుండా పోయింది. పరస్పరం లక్షిత ఓట్లను బదలాయించుకోవడంలో ఈ రెండు పార్టీలూ విఫలమయ్యాయి. మొత్తం మీద ఈ పొత్తు ద్వారా బీఎస్పీ కంటే సమాజ్‌వాది పార్టీకే ఎక్కువగా నష్టం వాటిల్లింది. రాజకీయ అవసరాల కోసం మాయావతితో పొత్తు పెట్టుకుని అఖిలేష్ రానున్న రోజుల్లో సమాజ్‌వాది పార్టీ వర్గాల నుంచి సెగలు తప్పవన్న సంకేతాలూ వెలువడుతున్నాయి.