జాతీయ వార్తలు

ప్రభంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో రెండే కులాలు ఉన్నాయి... ఒకటి పేదల కులం... మరొకటి పేదరికాన్ని అంతం చేసేందుకు శ్రమించే వారి కులం... నవభారత నిర్మాణ దిశగా మరింత ముందుకు సాగేందుకు ప్రజలు ఈ అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు.. కానీ ఇది మోదీ విజయం కాదు.. వ్యవస్థలో నిజాయితీ కోసం పాటుపడుతున్న వారి విజయం.. ప్రజల ఆశలు, ఆకాంక్షలు సాధించిన విజయం...
- ప్రధాని నరేంద్ర మోదీ
*
న్యూఢిల్లీ, మే 23: పదిహేడవ లోక్‌సభ ఎన్నికల్లో నమో (నరేంద్ర మోదీ) సృష్టించిన సునామీలో కాంగ్రెస్, తెలుగుదేశం, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, ఎన్సీపీ, పీడీపీ తదితర ప్రతిపక్షాలన్నీ కూకటివేళ్లతో కొట్టుకుపోయాయి. ప్రజలు బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏకు 347 సీట్లిచ్చి దేశాన్ని చౌకీదార్‌కు అప్పగించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకు 87, ఇతరులకు 108 సీట్లు లభించాయి. నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం బీజేపీకి 2014 కంటే ఎక్కువ సీట్లు సంపాదించి పెట్టి తమ సత్తాను చాటుకున్నారు. బీజేపీ స్వయంగా 303 సీట్లు గెలుచుకోగా మిత్రపక్షమైన శివసేన 18, జేడీయూ 15, అన్నా డీఎంకే 3, అకాలీదళ్ రెండు సీట్లు గెలుచుకున్నాయి. 87 సీట్లు గెలుచుకున్న యూపీఏ భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్ 49, ఆర్జేడీ రెండు సీట్లు ఎన్సీపీ 5, జేడీఎస్ 1, డీఎంకే 22 సీట్లు గెలుచుకున్నాయి. ఇతరులకు 110 సీట్లు లభించగా ఇందులో ఉత్తరప్రదేశ్‌లో మహాఘట్ బంధన్ ఏర్పాటు చేసిన ఎస్పీకి కేవలం 5, బహుజన్ సమాజ్ పార్టీకి 11 సీట్లు మాత్రమే లభించాయి. శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కేవలం ఐదు సీట్లలో ఆధిక్యం సంపాదించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ 22 సీట్లలో ఆధిక్యం సంపాదించి చరిత్ర సృష్టంచింది. అయితే తెలంగాణలో టీఆర్‌స్ డీలా పడిపోయింది. టీఆర్‌ఎస్ కేవలం తొమ్మిది సీట్లలో ఆధిక్యం సంపాదించింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో 44 సీట్లు గెలిస్తే ఈసారి అంతకంటే ఐదు సీట్లు ఎక్కువ గెలిచింది. ‘కాపలాదారు దొంగ కాదు.. హీరో’ (చౌకీదార్ చోర్ నహీ.. హీరో హై) అని దేశ ప్రజలు తీర్పిచ్చారు. పటిష్టమైన నాయకత్వం, బాలాకోట్‌పై యుద్ధ విమాన దాడులు నరేంద్ర మోదీకి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించి పెట్టాయి. నరేంద్ర మోదీ వారణాసిలో లక్ష ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధిస్తే.. గాంధీనగర్‌లో అమిత్ షా దాదాపు ఐదు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. చౌకీదార్ చోర్ హై అంటూ అనునిత్యం కోడైకూసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీలో ఓటలి పాలయ్యారు. అయితే కేరళలోని వాయనాడ్‌లో దాదాపు 8 లక్షల ఓట్ల అత్యంత భారీ మెజారిటీతో విజయం సాధించారు. అమేథీలో రాహుల్ గాంధీని దాదాపు ముప్పై వేల ఓట్లతో ఓడించటం ద్వారా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జెయింట్‌కిల్లర్ అవతారం ఎత్తారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, చీఫ్‌విప్ జ్యోతిరాధిత్య సింధియా, సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, సుశీల్‌కుమార్ షిండే తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఓడిపోయారు.
నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తి మట్టికరిచారు. ఉత్తర ప్రదేశ్‌లో మాయావతి, అఖిలేష్ యాదవ్ కూటమి కుప్పకూలింది. ప్రధాన మంత్రి పదవి చేపట్టాలని కలలు కన్న రాహుల్ గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ, శరద్ పవార్ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టకుండా చూసేందుకు ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తా, లక్నో చుట్టూ చక్కర్లు కొట్టిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికారం కోల్పోయి అభాసుపాలయ్యారు. దేశం మొత్తం మీద ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాత్రమే నరేంద్ర మోదీ సునామీని తట్టుకుని నిలబడగలిగారు. వారసత్వ రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించిన సుష్మితాదేవ్, జితిన్ ప్రసాద, గౌరవ్ గొగోయ్, జ్యోతిరాధిత్య సింధియా, దీపేందర్ సింగ్ హుడ్డా తదితరులు ఓటమి పాలయ్యారు. హిందూ ఉగ్రవాదం అనే కొత్త పదాన్ని చెలామణి చేయటం ద్వారా మైనారిటీ ఓట్లు సంపాదించేందుకు ప్రయత్నించిన దిగ్విజయ్ సింగ్ సాధ్వి ప్రజ్ఞాసింగ్ చేతిలో చిత్తయ్యారు. దేశంలోని అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్, అస్సాం, హర్యానా, ఢిల్లీ, కర్నాటక ప్రజలు నరేంద్ర మోదీకి బ్రహ్మరథం పట్టారు. రాజస్థాన్‌లోని 25, దేశ రాజధాని ఢిల్లీలో ఏడు సీట్లను గెలుచుకోవటం ద్వారా బీజేపీ మరోసారి రికార్డు సృష్టించింది. తెలంగాణలో నాలుగు సీట్లలో ఆధిక్యత సంపాదించటం ద్వారా బీజేపీ తన సత్తాను చాటుకుంది. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి జీవితకాలం షాక్ తగిలింది. రాష్ట్ర ప్రజలు బీజేపీకి అధిక సీట్లు ఇవ్వటం ద్వారా మమతా బెనర్జీని తిరస్కరించారు. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు కనుమరుగైపోగా బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి టీఎంసీకి ప్రత్యామ్నాయంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్, మాయావతి కూటమి ఘోరంగా విఫలమైంది. బీజేపీకి 2014 లభించినన్ని సీట్లు లభించకపోయినా దాదాపు అరవై సీట్లు గెలుచుకుని సత్తా చాటుకుంటే ఎస్పీ, బీఎస్పీ కూటమి కేవలం 20 సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ మెజారిటీ సీట్లు గెలుచుకుని మరోసారి తన బలాన్ని నిరూపించుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పరాజయం నామమాత్రమేనని చాటిచెప్పింది. ఇదిలాఉంటే గుజరాత్ ప్రజలు మరోసారి మొత్తం సీట్లను బీజేపీకి ఇవ్వటం ద్వారా నరేంద్ర మోదీ పట్ల తమకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. మహారాష్ట్ర ప్రజలు కూడా మెజారిటీ సీట్లను బీజేపీ-శివసేన కూటమికి ఇచ్చి మోదీ పట్ల తమకున్న విశ్వాసాన్ని చాటుకున్నారు. కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య నెలకొన్న అవిశ్వాసం బీజేపీకి బాగా కలిసివచ్చింది. ఒకవైపు నరేంద్ర మోదీకి ఉన్న మద్దతు.. రెండోవైపు కాంగ్రెస్-జేడీఎస్ అంతర్గత కుమ్ములాటల మూలంగా బీజేపీ మెజారిటీ సీట్లు గెలుచుకోవటం గమనార్హం. తమిళనాడులో అన్నా డీఎంకే-బీజేపీ కూటమి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. కేరళలో కూడా బీజేపీ ఏమీ సాధించలేదు. రాహుల్ గాంధీ వాయనాడ్ నుండి పోటీ చేయటం కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. కేరళలో కాంగ్రెస్ సీట్లు సంపాదించుకోగలిగింది.
*
లోక్‌సభ (542) బీజేపీ కాంగ్రెస్ ఇతరులు
గెలిచినవి 339 83 95
ఆధిక్యం 10 2 13