జాతీయ వార్తలు

బీజేపీ హవా.. కాంగ్రెస్ డీలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: భారతీయ జనతా పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు హస్తినలో సంబరాలు అంబరాన్నంటాయి. 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు రావడంతో గురువారం ఉదయం నుంచి హస్తినలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఉదయం నుంచీ దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకులంగా ఫలితాలు రావడంతో బాణసంచా పేలుస్తు, మిఠాయిలు పంచుకుంటూ ఆనందంతో నృత్యాలు చేశారు. బీజేపీ కార్యకర్తలతోపాటు నాయకులు కూడా డ్యాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ స్పష్టమైన మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు రావడంతో ఆ పార్టీ శ్రేణులు పార్టీ కార్యలయం వద్దకు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన పరిస్థితుల్లో దానికి తగిన విధంగానే పార్టీ కార్యాలయంలో పలు ఏర్పాట్లు చేశారు. దీంతో పార్టీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రానికి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు చేరుకువడంతో బారికేడ్లు ఏర్పాటు చేసి పార్టీ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించ లేదు.
డీలాపడ్డ కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించడంతో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వెలవెలబోయింది. ఢిల్లీలోని అక్బర్ రోడ్‌లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయం ఉదయం నుంచీ బోసిపోయి కన్పించింది. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఎక్కడా కూడ మెరుగైన ఫలితాలు రాకపోడంతో కార్యకర్తలు కాని, నాయకులు కాని ఎక్కడా కనిపించలేదు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు అధికారం వచ్చే అవకాశం లేదని చెప్పిన విధంగానే ఫలితాలు కూడా రావడంతో కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా డీలాపడ్డారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు గెలవకపోవడం కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బే. అలాగే ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, మాజీ కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ లాంటి నాయకులు ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.