జాతీయ వార్తలు

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: పదిహేడవ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాహుల్ తన రాజీనామా లేఖను గురువారం సాయంత్రం యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి అందజేశారు. అయితే సోనియా గాంధీ మాత్రం ఆయన రాజీనామా లేఖను ఆమోదించేందుకు నిరాకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఘోరంగా ఓడిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా చేయటం వలన దుష్ఫలితాలు తప్ప మంచి ఫలితాలు రావని సోనియా అభిప్రాయపడినట్లు తెలిసింది. త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులను విశే్లషించి తగు సర్దుబాటు చర్యలు తీసుకోవటం ద్వారా కాంగ్రెస్‌ను బతికించుకోవాలని సోనియా గాంధీ సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారం, పది రోజుల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి దారితీసిన పరిస్థితులను విశే్లషిస్తారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.
ఓటమికి బాధ్యత నాదే
లోకసభ ఎన్నికల్లో దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. గురువారం ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని రాహుల్ ప్రకటించారు. ప్రజలు మన యజమానులు.. వారు స్పష్టమన తీర్పిచ్చారు.. వారి తీర్పును ఆమోదిస్తున్నానని రాహుల్ ప్రకటించారు. బీజేపీని కూడా అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఓటమికి దారితీసిన పరిస్థితులపై వర్కింగ్ కమిటీలో సమీక్షిస్తామని అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఎప్పుడనేది ఆయన చెప్పలేదు. ఏం తప్పు జరిగిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. దేశ ప్రజలు ఇచ్చే తీర్పును శిరసావహిస్తానని ఎన్నికల ప్రచారం సందర్భంగా పలుమార్లు చెప్పాను.. అందుకే ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాను అని అన్నారు. ఈ రోజే ప్రజల తీర్పు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఓటమికి గల కారణాలేమిటనేది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ఓడిపోయినంత మాత్రాన భయపడవద్దని ఆయన కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులకు పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ ఓటమికి నూటికి నూరు శాతం బాధ్యత తానే తీసుకుంటున్నానని రాహుల్ ప్రకటించారు. అమేథీ ప్రజలు ఇచ్చిన తీర్పును ఆమోదిస్తున్నాను.. అమేథీలో విజయం సాధించిన స్మృతి ఇరానీని రాహుల్ అభినందించారు. అమేథీ ప్రజల బాగోగులు బాగా చూసుకోవాలని ఆయన స్మృతి ఇరానీకి విజ్ఞప్తి చేశారు. తనను ఎవరు ఎన్ని పద్ధతుల్లో విమర్శించినా, ఎంతగా దుర్భాషలాడినా తాను మాత్రం ప్రేమాభిమానాలతోనే బదులిస్తానని ప్రకటించారు. ప్రేమ ఎప్పటికీ ఓడిపోదని అన్నారు. ప్రజల తీర్పు గురించి ఈ రోజే విశే్లషణ చేపట్టవలసిన అవసరం లేదు. రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపడుతున్న నరేంద్ర మోదీ దేశ ప్రజల బాగోగులపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తమది సిద్ధాంతపరమైన పోరాటం.. నరేంద్ర మోదీకి ఒక రకమైన ఆలోచనా విధానం.. మాది మరో రకమైన ఆలోచనా విధానం.. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఆలోచనా విధానం విజయం సాధించిందని రాహుల్ గాంధీ చెప్పారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టాలని దేశ ప్రజలు నిర్ణయించారని అన్నారు.
దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం.. ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ నేతలను అభినందిస్తున్నట్లు ప్రియాంక తెలిపారు.