జాతీయ వార్తలు

అరుణాచల్‌లో బీజేపీ జయభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడిశాలో ఆరోసారీ నవీన్‌దే..* సిక్కింలో క్రాంతికారి మోర్చా విజయం
న్యూఢిల్లీ, మే 23: ఈశాన్యంలోని అరుణాచల్‌ప్రదేశ్‌లో మెజారిటీ సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావటం ద్వారా బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. 33 సీట్లున్న అరుణాచల్‌ప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 24 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ రెండు సీల్లు, జనతాదళ్ యునైటెడ్ నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్ పీపుల్స్ పార్టీ ఒక సీటు గెలుచుకోగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. ఇదిలావుంటే ఒడిశాలో బీజూ జనతాదళ్ అధినాయకుడు నవీన్ పట్నాయక్ మరోసారి విజయం సాధించటం ద్వారా తన సత్తా చాటుకున్నారు. ఒడిశా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేడీ 114 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 20 సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఇరవై రెండు సీట్లున్న సిక్కిం శాసనసభకు జరిగిన ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా 13 సీట్లు, సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్ తొమ్మిది సీట్లు గెలుచుకున్నది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అందరికీ తెలిసిందే.