జాతీయ వార్తలు

నెహ్రూ, ఇందిర తరువాత మూడో నేత మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తరువాత లోక్‌సభలో పూర్తి స్థాయి మెజారిటీతో వరుసగా రెండోసారి ప్రధానమంత్రి పదవి చేపడుతున్న మూడో నేత నరేంద్ర మోదీ. గురువారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేపట్టడానికి అవసరమయిన మ్యాజిక్ ఫిగర్ 272ను సులభంగా అధిగమించింది. దీంతో నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి రంగం సిద్ధమయింది. 2014 ఎన్నికల్లో మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 282 సీట్లను గెలుచుకుంది. దేశంలో 1951-52లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నెహ్రూ నాలుగింట మూడు వంతుల మెజారిటీతో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. తరువాత 1957, 1962లలో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన పూర్తి స్థాయి మెజారిటీని సాధించి తిరిగి ఆ పదవిని చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలి సార్వత్రిక ఎన్నికలు 1951 అక్టోబర్ నుంచి 1952 ఫిబ్రవరి వరకు అయిదు నెలల పాటు జరిగాయి. ఈ ఎన్నికల్లో 489 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 364 స్థానాలను గెలుచుకుంది. 1957 ఎన్నికల్లో ఆ పార్టీ 371 స్థానాలను గెలుచుకుంది. తిరిగి 1962లో 494 స్థానాలకు గాను 361 స్థానాలను గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తిరిగి నెహ్రూ వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టారు.1967 లోక్‌సభ ఎన్నికల్లో నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ మొత్తం 520 స్థానాలకు గాను 283 స్థానాలను సాధించడం ద్వారా తొలిసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.
1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఇచ్చిన గరీబీ హటావో నినాదం కారణంగా కాంగ్రెస్ పార్టీ 352 స్థానాలలో గెలుపొందగలిగింది. ఇందిరాగాంధీ వరుసగా రెండోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.