జాతీయ వార్తలు

ఉత్తర, పశ్చిమ భారతావనిలోనూ కమలం హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో విజయ దుందుభి మోగించిన భారతీయ జనతా పార్టీ తన జయ కేతనాన్ని పశ్చిమ, ఉత్తర భారతావనిల్లో సైతం చాటుకొంది. అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పైగా ఓట్లు కైవసం చేసుకొని రికార్డు స్థాయిలో విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది. నరేంద్ర మోదీ చరిష్మాతో జాతీయ పార్టీ కాంగ్రెస్ సహా, ప్రాంతీయ పార్టీలన్నీ అడ్రస్ లేకుండా పోయాయి. బీజేపీ ఓటమే ధ్యేయంగా సమాజ్‌వాదీ-బీఎస్పీలు కాలికి బలపం కట్టుకొని పోరాడినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లోని చాలా స్థానాల్లో మోదీ హవా కొనసాగింది. ఉత్తరప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానాల్లో కూడా 50 శాతంపైగా ఓట్లు సాధించి కాషాయ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొని చారిత్రక విజయాన్ని కైవసం చేసుకొంది. ఉత్తరప్రదేశ్‌లో 50 శాతం ఓట్ల షేర్‌ను సాధించి తీరుతామని ఎస్పీ-బీఎస్పీ కూటమికి విసిరిన సవాలును బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నిలబెట్టుకొన్నట్లయింది. యూపీలోని 71 స్థానాల్లో 60 స్థానాల్లో ఆధిక్యాన్ని చాటుకొని ప్రతిపక్ష కూటమిని కంగు తినిపించింది. రాజస్థాన్, గుజరాత్‌ల్లో గత లోక్‌సభ ఎన్నికలో అంతంతమాత్రంగానే ఉన్న బీజేపీ ఈసారి 25, 26 స్థానాల్లో అధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. ఇక చత్తీస్‌గఢ్‌లో అయితే ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీస్తూ 11 స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో ఆధిక్యాన్ని చాటుకొంటూ వచ్చింది. బిహార్‌లో నితీష్‌కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)తో కలిసి పోటీచేసిన బీజేపీ.. 17 పార్లమెంట్ స్థానాల్లో 16 సీట్లలో ఆధిక్యంలో నిలిచింది. మహరాష్టల్రో కూడా కమలం పార్టీ తన ఖాతాలో మెజారిటీ స్థానాలను వేసుకొంది. 25 స్థానాల్లో ఒంటరిగా పోటీచేసిన బీజేపీ 23 స్థానాల్లో అధిక్యంలో నిలిచింది. శివసేనతో కలిసి పోటీచేసిన 23 సీట్లనూ స్వీప్ చేయనుంది. హర్యానాలోని పది పార్లమెంట్ స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో ప్రతిపక్ష పార్టీలను మట్టికరిపించి ఆధిక్యంలో నిలిచింది. 2014లో ఇక్కడ కేవలం ఏడు స్థానాలను బీజేపీ గెలిచింది. జార్ఖండ్‌లో 13 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయగా 11చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక్కడ 49 శాతం ఓట్లు బీజేపీ ఖాతాలో పడ్డాయి. మొత్తంగా చూస్తే దాదాపు 300 పైగా స్థానాలను కైవసం చేసుకొని దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించనుంది.