జాతీయ వార్తలు

ప్రమాణ స్వీకారం ఎప్పుడు.. ఎక్కడ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారీ మెజారిటీతో విజయం సాధించిన నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు క్యాబినెట్ కార్యదర్శి కార్యాలయం ఎన్ని ఏర్పాట్లు చేస్తోంది. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం రాష్టప్రతి భవన్‌లో చేస్తారా లేక 2014లో చేసినట్లు రాష్టప్రతి భవన్ ముందున్న మైదానంలో చేస్తారా అనేది ఇంకా స్పష్టం కాలేదు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందనేది కూడా ఇంకా స్పష్టం కాలేదు. నరేంద్ర మోదీ ఒక్కరే ప్రధాన మంత్రిగా ప్రమాణం చేస్తారా లేక తనతోపాటు కొంతమంది సీనియర్ల చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారా? అనేది వెల్లడి కావటం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో తాము భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తున్నట్లు స్పష్టం కాగానే నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి నివాసంలో సీనియర్ సలహాదారులతో సమావేశమై మంత్రివర్గం నిర్మాణంపై సమాలోచనలు ప్రారంభించినట్లు తెలిసింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొద్దిసేపు ఈ సమావేశానికి హాజరైన తరువాత బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారని అంటున్నారు. నరేంద్ర మోదీ శుక్రవారం తన పాత మంత్రివర్గం సహచరులతో సమావేశం కానున్నారు. ఇది జరిగిన అనంతరం ఆయన బీజేపీ అధ్యక్షుడు, ఇతర సీనియర్ నాయకులతో సమావేశం అవుతారని అంటున్నారు. ఎన్‌డీఏ రేపు లేదా ఎల్లుండి సమావేశమై నరేంద్ర మోదీని మరోసారి తమ నాయకుడుగా ఎన్నుకుంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన నివేదికను రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు శుక్రవారం అందజేస్తుందని అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుండి లోక్‌సభ ఎన్నికల ఫలితాల నివేదిక అందిన వెంటనే రామ్‌నాథ్ కోవింద్ ఎన్‌డీఏ నాయకుడు నరేంద్ర మోదీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారు.
అందరి విశ్వాసం చూరగొన్నాం : మోదీ
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరినీ కలుపుకొని పోతూ సమర్థవంతంగా దేశ నిర్మాణానికి పాటుపడేందుకు బీజేపీ మరోసారి సాధించిన అఖండ విజయం దోహదపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. గురువారం కౌంటింగ్ సందర్భంగా వస్తున్న ఫలితాల సరళిని ఉద్దేశించి మోదీ ఈ ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా అనేక పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతాపార్టీ అనూహ్య సాధించడాన్ని నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ.. ‘మీ అందరి సహకారంతో... అందరికీ అభివృద్ధి ఫలాలు అందిస్తూ.. ప్రతి ఒక్కరిలో బీజేపీపై విశ్వాసాన్ని నింపగలిగామని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘కలిసికట్టుగా ఎదుగుదాం.. అభివృద్ధి సాధిద్దాం.. సమర్థవంతమైన దేశంగా భారత్‌ను నిర్మించుకొందాం’ అంటూ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.