జాతీయ వార్తలు

ఇక అసెంబ్లీ ఎన్నికలపైనే స్టాలిన్ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 24: లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ద్రవిడ మునే్నట్ర ఖజగం (డీఎంకె) అధ్యక్షుడు స్టాలిన్ ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి సారించారు. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకె చరిత్ర సృష్టించింది. 38 సీట్లలో 37 సీట్లను కైవసం చేసుకోగా, ఒక్క స్థానాన్ని అన్నాడీఎంకె గెలుపొందింది. మరో స్థానానికి (వెల్లూరు) ఎన్నిక జరగలేదు. కాగా 22 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కేవలం 13 స్థానాలను మాత్రమే డీఎంకె దక్కించుకోగలిగింది. అఖిల భారత డ్రవిడ మునె్నట్ర ఖజగం (అన్నాడీఎంకె) తొమ్మిది స్థానాలను దక్కించుకుంది. ఇలాఉండగా 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయాలని డీఎంకె అధ్యక్షుడు స్టాలిన్ సన్నాహాలు చేపట్టారు. అన్నాడీఎంకె బీజేపీతో కలిసి పని చేసినా ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభంజనం కొనసాగి 350 స్థానాల్లో విజయం సాధించినా, ఇక్కడ మాత్రం భిన్నమైన ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాల పాటు తిరుగులేని అధిపత్యాన్ని చెలాయించిన కరుణానిధి మరణానంతరం డీఎంకె సారథ్యాన్ని చేపట్టిన స్టాలిన్ అనూహ్యరీతిలోనే పార్టీని విజయతీరాలకు చేర్చారు. పైగా తండ్రి మరణానంతరం ఆయన ఎదుర్కొన్న తొలి ఎన్నిక ఇదే కావడం స్టాలిన్ నాయకత్వ పటిమకు సంకేతకం గా నిలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో విపక్షాలు ఏకమవుతున్న తరుణంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించింది కూడా స్టాలినే కావడం గమనార్హం.