జాతీయ వార్తలు

పార్లమెంటులో నారీ శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కొలువుదీరనున్న పదిహేడవ లోక్‌సభ సంచలనాలను నమోదు చేసుకోనుంది. మహిళల ప్రాతినిధ్యం పెరగడమే కాకుండా ఎన్నికైన సభ్యుల్లో ముస్లింలు కూడా గణనీయంగా పెరగడం ఓ విశేషం. 1952 ఎన్నికల తర్వాత అత్యధికంగా 14 శాతం సభ్యులు మహిళలే కావడం 17వ లోక్‌సభ ప్రత్యేకత. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉంటూనే వస్తున్నా ప్రతి లోక్‌సభలోనూ మహిళల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. ప్రస్తుతం పార్లమెంటులో అడుగుపెట్టనున్న మహిళల శాతం 14కు చేరింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన సొంత నియోజకవర్గమైన అమేథీలో బీజేపీ ప్రత్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోవడం ఈ ఎన్నికల్లో ఆశ్చర్యపరిచే విషయం. మొత్తం 542మంది సభ్యుల్లో 78మంది మహిళలు ఈసారి పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. వీరిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి 11మంది చొప్పున విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల బరిలో దేశవ్యాప్తంగా 724మంది మహిళలు పోటీపడ్డారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 54మంది, బీజేపీ నుంచి 53మంది పోటీచేశారు. 41మంది సిట్టింగ్ ఎంపీల్లో 27మంది విజయకేతనం ఎగురవేశారు. సోనియాగాంధీ, హేమమాలిని, కిరణ్ ఖేర్ వంటి ఉద్దండులే కాదు వివాదాస్పద బీజేపీ నేత ప్రజ్ఞ్ఠాకూర్ కూడా విజయం సాధించారు. సాక్షాత్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ నుంచి ఓడించి స్మృతి ఇరానీ సంచలనం సృష్టించగా, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌ను పరాజయంపాలు చేసి ప్రజ్ఞ్ఠాకూర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరపున 24మంది, తృణమూల్ కాంగ్రస్ 23మంది, సీపీఎం 10మంది, ఎన్సీపీ తరపున ఒక మహిళ ఎన్నికల బరిలో పోటీపడ్డారు. అంతేకాకుండా మరో 222మంది మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేశారు. 542 స్థానాలు కలిగిన పార్లమెంటుకు 8,049మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో స్వతంత్రులుగా నలుగురు ట్రాన్స్‌జెండర్లు, ఆప్ నుంచి మరొకరు పోటీపడగా అందరూ ఓటమి పాలయ్యారు. 16వ లోక్‌సభలో 64మంది, 15వ లోక్‌సభలో 52మంది, 14వ లోక్‌సభలో 52మంది, 13వ లోక్‌సభలో 52మంది, 12వ లోక్‌సభలో 44మంది, 11వ లోక్‌సభలో 41మంది, 10వ లోక్‌సభలో 42మంది మహిళలు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించారు.
పెరిగిన ముస్లిం ఎంపీల సంఖ్య
పదిహేడవ లోక్‌సభలో ముస్లింల ప్రాతినిధ్యం 27కు పెరిగింది. గత లోక్‌సభలో వీరి సంఖ్య 23 మాత్రమే. ఈసారి లోక్‌సభలో అడుగుపెట్టే ముస్లిం ఎంపీల్లో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి విజయం సాధించడం విశేషం. ఈ రెండు రాష్ట్రాలనుంచి ఆరుగురు చొప్పున విజయకేతనం ఎగురవేశారు. ఎన్సీపీ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆజంఖాన్ వంటి ఉద్దండులు ఈ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. 130 కోట్ల దేశ జనాభాలో 20 శాతంమంది ముస్లింలు ఉన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న 15వ లోక్‌సభలో 30, 14వ లోక్‌సభలో 34మంది ఎంపీలు ఎన్నికయ్యారు.