జాతీయ వార్తలు

ఫిరాయింపుదారులకు ఆశనిపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 24: యూపీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీల ఫిరాయింపుదారులకు ఆశనిపాతం ఎదురైంది. అయితే, కేవలం ఇద్దరు ఫిరాయింపుదారులు మాత్రమే ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. వారిలో ప్రవీణ్ నిషాద్ (బీజేపీ), కున్వర్ దనిష్ అలీ (బీఎస్పీ) ఉన్నారు. ఎస్పీ-బీఎస్పీ తరఫున గోరక్‌పూర్ నుంచి పోటీ చేసి ఎన్నో విజయాలు అందుకున్న ప్రవీణ్ నిషాద్ అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు చాన్స్ దక్కకపోవడంతో పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారు. ఈసారి సంత్ కబీర్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి, బీఎస్పీ అభ్యర్థి భీష్మా శంకర్‌పై 35,749 ఓట్ల తేడాతో గెలుపొందారు. అదేవిధంగా మరో ఫిరాయింపుదారు కున్వర్ దనిష్ అలీ ఈసారి ఎన్నికల్లో అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేశారు. తన సమీ ప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్‌పై 63,248 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కున్వర్ దనిష్ అలీ ఇటీవల కాలం వరకు జేడీఎస్‌లో సీనియర్ నాయకుడిగా చెలామణి అయ్యారు. అయితే, ఈసారి అతనికి పార్టీ అధిష్టానం టికెట్‌ను నిరాకరించడంతో పార్టీ ఫిరాయించి బహజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇక పలువురు వివిధ పార్టీల నుంచి టికెట్లను ఆశించి భంగపడి, చివరకు వేరొక పార్టీలో చేరిన నాయకులు ఆయా పార్టీల తరఫున టికెట్లను సంపాదించినా ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు సాధించలేకపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీకి రాజీనామా చేసిన సావిత్రి బాయి పూలే కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ను సాధించినా, కేవలం 34,383 ఓట్లు మాత్రమే సాధించినా డిపాజిట్‌ను కూడా దక్కించుకోలేకపోయారు. వెనుకబడిన కులాలు, దళితుల హక్కులను అధిష్టానం హరిస్తోందంటూ ఆరోపణలు గుప్పించడం ద్వారా బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన ఆమె కాంగ్రెస్‌లో చేరిన వెంటనే టికెట్ దక్కించుకున్నా ఫలితం లేకపోయింది. రాయబరేలీ నుంచి పోటీ చేసిన యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి తన సొంత పార్టీకి చెందిన అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ నుంచి పోటీ ఎదురైంది. అయితే, ఈ ఎన్నికల్లో దినేష్ పరాజయంపాలు కాగా, అతనిపై సోనియా 1,67,178 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని అల్హాబాద్‌లో బాండా బీజేపీ సిట్టింగ్ ఎంపీ శ్యామ్‌చరణ్ గుప్తా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బీజేపీని వీడి సమాజవాది పార్టీలో చేరారు. అయితే, బీజేపీ అభ్యర్థి ఆర్.కే.సింగ్ చేతిలో 58,938 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. సీతాపూర్ లోక్‌సభ స్థానం నుంచి 2009 ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఎంపీగా గెలిచిన కైసర్ జహాన్‌కు ఈసారి టికెట్ దక్కకపోవడంతో పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరారు. అయినా ఓటమి తప్పలేదు. అదేవిధంగా ఫతేపూర్ మాజీ ఎంపీ, సమాజవాది పార్టీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాకేష సచన్ ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. ఫతేపూర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అతనికి నిరాశే మిగిలింది. యూపీలో బీఎస్పీ అధినేత్రి మాయావతికి కీలక అనుచరుడిగా గుర్తింపు దక్కించుకున్న నసీముద్దీన్ సిద్ధిఖి ఆ పార్టీ తరఫున టికెట్ దక్కలేదు. దీంతో బీఎస్పీని వీడి కాంగ్రెస్ తరఫున బిజ్నోర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన పరాజయం తప్పలేదు. ఇక ఇటావా లోక్‌సభ సిట్టింగ్ బీజేపీ ఎంపీ అశోక్ కుమార్ ధోరేకు ఈసారి ఆ పార్టీ తరఫున టికెట్ దక్కలేదు. దీంతో అదే స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న ఆయనకు ఓటమే మిగిలింది.