జాతీయ వార్తలు

17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ కనుమరుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కకావికలమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల వ్యూహాలను ఛేదించుకుని ముందు నిలబడడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఫలితంగా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నివ్వెరపోయింది. 17 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుపొందలేదు. ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛండీఘర్, హర్యానా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, త్రిపుర, కాశ్మీర్, మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్, సిక్కిం, దాదర్, నాగర్ హ్యవేలీ, దామన్-డియో, లక్ష్యద్వీప్‌లో నామరూపాలు లేకుండా పోయింది. 17 రాష్ట్రాల్లో బీజేపీకి 50 శాతానికి పైగా ఓట్లు లభించాయి. కాంగ్రెస్ నాయకత్వ పని తీరుపై సొంత పార్టీలో విమర్శలు, గుసగుసలు ఆరంభమయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్, ఒడిశా కాంగ్రెస్ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇలాఉండగా శనివారం (25న) ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.