జాతీయ వార్తలు

అమల్లోకొచ్చిన రూ.10 లక్షల బీమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: రైలు ప్రయాణికులకు పది లక్షల రూపాయ బీమా పథకం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకుంటే టికెట్‌పై 92 పైసలు మాత్రమే ప్రీమియంగా చెల్లించాలి. ఈ సదుపాయం సబర్బన్ రైళ్లతోపాటు అన్ని సర్వీసులకూ వర్తిస్తుంది. దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఐదేళ్లలోపు పిల్లలకు, విదేశీ ప్రయాణికులకు కొత్త బీమా పథకం వర్తించదు. కన్‌ఫర్మ్‌డ్, ఆర్‌ఏసి, వెయిటింగ్ లిస్టు టికెట్లపై బీమా లభిస్తుంది. ప్రయాణికుడు/నామినీ/లీగల్ హైర్‌కు బీమా చెల్లిస్తారు. ప్రమాదంలో చనిపోతే 10 లక్షల రూపాయలు, వైకల్యం పొందితే 7.5లక్షలు ఇస్తారు. ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం పది వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకూ ప్రయాణికుడికి చెల్లించేలా పథకంలో పొందుపరిచారు. ఉగ్రవాద దాడులు, దోపిడీ, లూటీ, కాల్పులు, అగ్ని ప్రమాదాలకు బీమా సదుపాయం వర్తిస్తుంది.