జాతీయ వార్తలు

వేర్పాటువాదులకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 1: జమ్మూకాశ్మీర్‌లో అశాంతిని సృష్టిస్తున్న వేర్పాటువాదులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. వేర్పాటువాదులకు అందుతున్న సేవలపై ఆంక్షలు విధించడం ద్వారా కట్టడి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. విమానం టికెట్లు, హోటల్, టాక్సీ సర్వీసులు అందకుండా చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ యోచన. వేర్పాటువాద నేతలు సయ్యద్ అలీ షా గిలానీ, మిర్వైజ్ ఫరూఖ్, యాసిన్ మాలిక్ తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. రాష్ట్రంలో ప్రధానంగా కాశ్మీర్ లోయలో యువతను రెచ్చగొడుతూ అంశాతిని పురిగొల్పుతున్న వేర్పాటువాద నేతలను అదుపుచేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించినట్టు ‘అమర్ ఉజాలా’లో వార్తా కథనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని బిజెపి-పిడిపి సంకీర్ణ ప్రభుత్వానికి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు అందాయని నివేదికలో వెల్లడించారు. వేర్పాటువాదులకు ప్రభుత్వపరంగా కల్పిస్తున్న భద్రతను తొలగించాలన్నది ఓ ప్రతిపాదన. గిలానీ, మాలిక్, ఫరూఖ్‌లకు భద్రత కోసం 950 మంది పోలీసులను నియోగిస్తున్నారు. ముగ్గురు కీలక నేతలను ఇళ్లకే పరిమితం చేయడం ద్వారా శాంతియుత పరిస్థితులు నెలకొల్పవచ్చని భావిస్తున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తరువాత కాశ్మీర్ అట్టుడికిపోయింది. సుమారు 55 రోజులు బంద్‌లు, సమ్మెలతో లోయ ప్రాంతం కంటిమీద కునుకులేదు. పౌర జీవనం అస్తవ్యవస్తమైంది.