జాతీయ వార్తలు

తమిళనాడులో ఇక 9 నెలల ప్రసూతి సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 1: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో ఎన్నికల హామీని నెరవేర్చారు. రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవును ఇప్పుడున్న ఆరు నెలలనుంచి 9 నెలలకు పెంచుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆమె గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవును 2001లో తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మూడు నెలలనుంచి ఆరు నెలలకు పెంచిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1980నుంచి 2011 సంవత్సరం దాకా మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు 90 రోజులు మాత్రమే ఉండిందని ఆమె చెప్పారు. ‘రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవును ఆరు నెలలనుంచి 9 నెలలకు పెంచుతామన్న అన్నా డిఎంకె ఎన్నికల హామీని నెరవేరుస్తూ ఈ ప్రసూతి సెలవును 9 నెలలకు పెంచుతున్నట్లు ప్రకటిస్తున్నాను’ అని జయలలిత తెలిపారు. అంతేకాదు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాల మెరుగుకోసం మొత్తం 1400 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే పలు కార్యక్రమాలను కూడా ఆమె ప్రకటించారు. ఇప్పుడు చెన్నైలో అమలవుతున్న అమ్మ ఆరోగ్య పథకం, అమ్మ మాస్టర్ హెల్త్ చెకప్, మహిళలకోసం అమ్మ మాస్టర్ హెల్త్ చెకప్ పథకాలను కోయంబత్తూరు, తిరునల్వేలి, మదురై ప్రభుత్వ మెడికల్ కాలేజి ఆస్పత్రులకు విస్తరిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అలాగే చెన్నై కీల్పాక్, మదురై, కోయంబత్తూరు ప్రభుత్వ మెడికల్ కాలేజి ఆస్పత్రుల్లో రూ.356.50 కోట్ల ఖర్చుతో కొత్త వౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. పలు ప్రభుత్వ ఆస్పత్రులకు నూతన భవనాలను నిర్మించడంతో పాటు వాటిలో సి-ఆర్మ్, ఎంఆర్‌ఐ-స్కాన్ లాంటి ఆధునిక వైద్య పరీక్ష పరికరాలను కొనుగోలు చేయనున్నట్లు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి రూ 30 కోట్ల విలువైన పలు పథకాలను కూడా జయలలిత ప్రకటించారు.