జాతీయ వార్తలు

గోవా ఆర్‌ఎస్‌ఎస్‌లో చీలిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, సెప్టెంబర్ 1: గోవా ఆర్‌ఎస్‌ఎస్ నిలువునా చీలిపోయింది. గోవా ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్ష పదవినుంచి తనను తప్పించడం వెనుక కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, నితిన్ గడ్కరీల హస్తం ఉందని అధ్యక్ష పదవినుంచి తొలగించిన సుభాష్ వెలింగ్‌కర్ గురువారం ఆరోపించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా గోవా పర్యటన సమయంలో గోవా పాఠశాలల్లో బోధనా భాష అంశంపై నల్లజెండాలను ప్రదర్శించినందుకు వెలింగ్‌కర్‌ను గోవా ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్ష పదవినుంచి తొలగిస్తున్నట్లు నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ప్రకటించిన విషయం తెలిసిందే. తనను పదవినుంచి తప్పించడం ఆశ్చర్యం కలిగించలేదని, తాను ముందునుంచీ దీన్ని ఊహిస్తూనే ఉన్నానని చెప్పిన వెలింగ్‌కర్, దీనివెనుక పారికర్, గడ్కరీలున్నారని ఆరోపించారు. ఈ ఇద్దరూ కేంద్రంలో బలమైన వారని, వారే తనపై తప్పుడు సమాచారం ఇచ్చి ఈ చర్య తీసుకునేలా చేశారని ఆయన అన్నారు. కాగా, బుధవారం తాను ఏర్పాటు చేసిన సమావేశానికి 600 మంది దాకా కార్యకర్తలు హాజరయ్యారని, వారంతా తనకు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేశారని వెలింగ్‌కర్ చెప్పారు. తామంతా కూడా కనీసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకానైనా ప్రత్యేక వర్గంగా కొనసాగుతామని ఆయన చెప్పారు. తామంతా కొంకణ్ ఆర్‌ఎస్‌ఎస్ విభాగంతో సంబంధాలు తెంచుకుంటున్నామని ఆయన చెప్తూ, ఈ రోజు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. తనపై చర్య తీసుకున్నందుకు పారికర్, గడ్కరీలో తర్వాత పశ్చాత్తాప పడక తప్పదని కూడా ఆయన హెచ్చరించారు.