జాతీయ వార్తలు

సందీప్ కుమార్ మా ఉద్యోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: పదవీచ్యుతుడయిన ఢిల్లీ స్ర్తిశిశు సంక్షేమ శాఖ మంత్రి సందీప్ కుమార్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సందీప్ కుమార్ తమ ఉద్యోగి అని ప్రపంచంలోనే అతిపెద్ద పోర్నోగ్రఫీ వెబ్‌సైట్ పోర్న్‌హబ్ అభివర్ణించింది. వినియోగదారులు అప్‌లోడ్ చేసే అంశాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్న పోర్న్‌హబ్ ‘మేము సందీప్ కుమార్ సహా మా ఉద్యోగులందరినీ ప్రేమి స్తాం’ అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన సందేశంలో పేర్కొంది. ఈ పరిణామాలను వార్తాసంస్థ డిఎన్‌ఎ గురువారం వివరించింది. ఇదిలా ఉండగా, ‘అభ్యంతరకర’ సిడిలో ఏమీ లేదని, తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని సందీప్ కుమార్ పేర్కొన్నారు. దళితుడనయినందుకే మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.