జాతీయ వార్తలు

ఆక్రమిత కాశ్మీర్ మనదే అయ్యేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: పాకిస్తాన్‌తో 1971లో యుద్ధం నాటికి వాయుసేన శక్తిని పూర్తిగా వినియోగించుకోలేదని ఎయిర్‌చీఫ్ మార్షల్ అరూప్ రాహా అన్నారు. సైనిక పరిష్కారానికి వెళ్లి ఉంటే పాక్ అక్రమిత కాశ్మీర్ మన చేతుల్లోనే ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ రక్షణకు తగిన రీతిలో పరిష్కారాన్ని సాధించేందుకు భారత్ ప్రయత్నించలేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో రక్షణరంగ వాతావరణం బాగా చెడిపోయిందని, కాశ్మీర్‌లో శాంతిని సాధించేందుకు ప్రస్తుత సంక్షోభాన్ని గట్టిగా ఎదుర్కోవలసి ఉందని ఆయన అన్నారు.
ఐక్యరాజ్యసమితి చార్టర్‌లో మన విదేశాంగ విధానం, పంచశీల వంటి అంశాలు ఉన్నతంగా ఉన్నప్పటికీ, కాశ్మీర్‌లో నెలకొన్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పరిష్కారాన్ని సాధించేందుకు తగిన విధానాన్ని భారత్ అనుసరించలేదని రాహా వ్యాఖ్యానించారు.
సంక్షోభాల్ని ఎదుర్కోవటానికి, దేశ వ్యతిరేక శక్తులను నిరోధించటానికి భారత్ సైనిక శక్తిని, ముఖ్యంగా వైమానిక శక్తిని ఉపయోగించుకోవటానికి అయిష్టంగా ఉందని ఆయన అన్నారు. ‘‘సైనిక పరిష్కారం అందుబాటులో ఉన్న సమయంలో మనం శాంతియుత పరిష్కారంకోసం ఐక్యరాజ్యసమితికి వెళ్లాం. పర్యవసానంగా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇంకా గుదిబండగా మిగిలిపోయింది. 1962, 1965లలో కూడా మనం వాయుసేనను తక్కువగా వినియోగించుకున్నాం అని రాహా అన్నారు. 1971 యుద్ధంలో పూర్తిస్థాయిలో వాయుసేన ఉపయోగపడటం వల్లనే బంగ్లాదేశ్ ఏర్పడగలిగిందని ఆయన పేర్కొన్నారు.

చిత్రం.. ఎయిర్‌చీఫ్ మార్షల్ అరూప్ రాహా