జాతీయ వార్తలు

పెండింగ్ నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణకు కేంద్ర నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తి చేశారు. అలాగే మిషన్ భగీరథ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో సగం భాగాన్ని కేంద్రం భరించాలని కోరారు. కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి సమావేశమయ్యారు. రాష్ట్రానికి పలు అభివృద్ధి పథకాలకు నిధులు మంజూరు చేయాలని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం ఎర్రబెల్లి విలేఖరులతో మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.760 కోట్ల మెటిరీయల్ కాంపోనెంట్ నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన విధంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖకు పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల జనాభా 40 శాతం ఉన్న పరిస్థితుల్లో అంత్యోదయ మిషన్‌ను అమలు చేస్తున్నామని.. తగిన విధంగా ఈ పథకానికి నిధులు మంజు రు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. గ్రామాల్లోని ఆర్థిక, సామాజిక, భౌతిక అవసరాల కోసం కేంద్రం శ్యాంప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్ కింద అర్బన్ గ్రోత్ క్లస్టర్లును తెలంగాణకు మంజూరు చేయాలని కోరినట్టు చెప్పారు. అంతకుముందు కేంద్ర వనరుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ‘గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిర్వహణ, స్వచ్చ్భారత్’పై జరిగిన సదస్సులో ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటికీ నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్రం ఇటువంటి సదస్సులు నిర్వహించడం మంచి పరిణామని అన్నారు. ‘మిషన్ భగీరథ’ పేరుతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంటింటికీ నీరు అందిస్తోందని, దీని నిర్వహణకు పెద్దఎత్తున నిధులు వ్యయం అవుతున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా వేసవి కాలంలో తెలంగాణ ప్రభుత్వం నీటి కొరత లేకుండా చేయగలిగినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా కొంత మొత్తాన్ని కేంద్ర భరించాలని ఆయన కోరారు. ఈ పథథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలు అభినందనలు తెలియజేసినట్టు దయాకర్‌రావు వెల్లడించారు.