జాతీయ వార్తలు

లోకాయుక్త ముసాయిదాపై హజారే కమిటీ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, జూన్ 11: మహారాష్టల్రో లోకాయుక్త కొత్త ముసాయిదా తయారీకి సామాజిక కార్యకర్త అన్నా హజారే నేతృత్వంలోని సంయుక్త కమిటీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ కమిటీ మంగళవారంనాడు ఇక్కడ భేటీ అయింది. 10 మంది సభ్యులతో కూడిన ఈ సంయుక్త కమిటీ కొత్త ముసాయిదాను తయారు చేసి ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే ప్రభుత్వానికి అందజేయనుంది. కొత్త ముసాయిదా ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న సంయుక్త కమిటీలో విశ్వంభర్ చౌదరి, మాజీ ఐఏఎస్ అధికారి ఉమేష్‌చంద్ర సారంగి, శ్యామ్ సుందర్ అసావా, బాలాసాహెబ్ పథాడేతోపాటు అన్నా హజారే, మహారాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. ముసాయిదా బిల్లు రూపొందించే విషయంలో మంగళవారం, బుధవారం రోజుల్లో సమగ్రంగా చర్చించి తమ తమ అభిప్రాయాలను క్రీడీకరించనున్నారు.
లోకాయుక్త చట్టాన్ని బలంగా రూపొందించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్ష చేసిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ లోకాయుక్త ముసాయిదా ఏర్పాటుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన హామీ ఇచ్చారు. ఇదిలావుండగా, లోకాయుక్త ముసాయిదాపై ఏర్పాటైన కమిటీ తన కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకు అన్నా హజారే మీడియాతో మాట్లాడుతూ మహారాష్టల్రో బలమైన లోకాయుక్త ముసాయిదా బిల్లును రూపొంచనున్నామని స్పష్టం చేశారు. ముసాయిదా బిల్లును సమగ్రంగా తయారు చేసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమోదం కోసం ఉంచుతామని ఆయన తెలిపారు.