జాతీయ వార్తలు

శ్రీనగర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 11: జమూ-కాశ్మీర్‌లోని షొపియాన్ జిల్లాలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. షొపియాన్ జిల్లాలోని అవినీరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు సైనిక బలగాలు మంగళవారం తెల్లవారుజామున ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా, సైనిక బలగాలూ కాల్పులు జరిపాయని, ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని ఆయన వివరించారు. ఆ ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారని ఆ పోలీసు అధికారి తెలిపారు. ఉగ్రవాదుల వద్ద ఉన్న తుపాకులను, ఇతర ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. మరణించిన ఇద్దరిలో ఒకరు కుల్గం జిల్లాకు చెందిన సాయర్ అహ్మద్ భట్ అని, రెండో వ్యక్తి అవినీరా ప్రాంతానికి చెందిన షాకిర్ అహ్మద్ వాఘే అని గుర్తించినట్లు ఆయన తెలిపారు. దేశంలో శాంతి-్భద్రతలకు విఘాతం కలిగించడమే వారి ధ్యేయమని అన్నారు.