జాతీయ వార్తలు

శ్రీనగర్‌లో మళ్లీ కర్ఫ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 3: జమ్మూకాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగింది. లాల్‌చౌక్, ఎయిర్‌పోర్టు రోడ్డు దిగ్బంధంకోసం వేర్పాటువాదులు పిలుపునిచ్చిన నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించారు. వరుసగా 57 రోజూ పౌరజీవనం అస్తవ్యవస్తమైంది. ఐదు పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ అమలులోనే ఉందని సిటీ పోలీసు అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ డౌన్‌టౌన్, బటమాలూ, మైసూమా, అప్‌టౌన్ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు కొనసాగాయి. కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాశ్మీర్ లోయలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు నిర్ణయించడాన్ని వేర్పాటువాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. సిటీ సెంటర్ లాల్‌చౌక్, జిల్లా కేంద్రం, విమానాశ్రయాన్ని ఆధీనంలోకి తీసుకోవాలని, శని, ఆదివారాలు ఆందోళన చేయాలని వేర్పాటువాదులు పిలుపునిచ్చారు. దీనిపై పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కర్ఫ్యూ ఎత్తివేసిన పట్టణాల్లోనూ శుక్రవారం నుంచి మళ్లీ నిషేధాజ్ఞలు విధించారు. పుల్వామా, కుల్‌గావ్, షోపియాన్, బారాముల్లా, పఠాన్ పట్టణాలు, శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా అల్లర్లు తలెత్తడంతో మళ్లీ ఆంక్షలు విధించినట్టు అధికారులు వెల్లడించారు.