జాతీయ వార్తలు

10 శాతం రిజర్వేషన్లతో ఎంతమందికి మేలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, జూన్ 12: విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఎంత మందికి లబ్ది చేకూరుతుందన్న అంశంపై గోవా ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. జనరల్ క్యాటగిరీల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవాలని గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవడానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం ఆమోదించారు. అయితే దీని వల్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో ఎంత మందికి లబ్ది చేకూరుతుందో ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్ర సావాల్కర్ తెలిపారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు లబ్దిదారులను లెక్కిస్తున్నట్లు ఆయన చెప్పా రు. జనరల్ క్యాటగిరిలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం వల్ల పెద్ద సంఖ్యలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం వివరాలు ఏవీ లేవన్నారు.