జాతీయ వార్తలు

అస్సాంను అన్ని విధాలా ఆదుకుంటాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: అస్సాం ప్రజలను, నార్త్‌ఈస్ట్రన్ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందేలా, వృద్ది, పురోగతి సాధించేలా సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. రెండోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని చేపట్టడంతో సీఎం సోనోవాల్ బుధవారం ప్రధాని మోదీని కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అస్సాం అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు సహకరిస్తానని హమీ ఇచ్చారు. అస్సాం వేగవంతంగా అభివృద్ధి చెందేలా తన వంతు సహకారం అందిస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్లు సోనోవాల్ చెప్పారు. ప్రధాని మోదీతో మంతనాలు జరిపిన అనంతరం సీఎం సోనోవాల్ పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ అస్సాం అభివృద్ధిపై ప్రధాని ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. రాష్ట్రంలో ఏయే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని, ఇంకా ఏయే పనులు ప్రారంభమై పూర్తి కాలేదని, ప్రభుత్వం తీసుకున్న కొత్త పథకాలు ఏమిటని ప్రధాని ప్రశ్నించారని ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత అస్సాం అభివృద్ధి బాటలో నడిచేందుకు సంపూర్ణ సహకారం అందించారని ఆయన చెప్పారు. ముఖ్యంగా జాతీయ రహదారుల అభివృద్ధి, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, రైల్వే నెట్ వర్క్ పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రెండో విడత హయాంలో రెట్టింపు సహకారంతో తమ రాష్ట్రం మరింత ప్రగతి పథంలో నడుస్తుందన్న నమ్మకం తనకు ఉందని సీఎం సర్బానంద సోనోవాల్ తెలిపారు.