జాతీయ వార్తలు

నా మతం మానవత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, జూన్ 12: ‘నా మతం మానవత్వం’ అంటోంది బాలీవుడ్ నటి దియా మీర్జా. మతం సాధన చేయాలి.. కానీ, అదే గుర్తింపు కాకూడదనేది తన అభిప్రాయంగా చెబుతోంది. ఈ విషయం గురించి దియా వివరిస్తూ- ‘నేను జిడ్డు కృష్ణమూర్తి తత్త్వశాస్త్రాన్ని అనుసరించి ఓ పాఠశాలకు వెళ్లాను. నేను క్రిస్టియన్ తండ్రి, బెంగాలీ అమ్మల ముద్దుల గారాల పట్టిని. అంతేకాదు, ఓ ముస్లిం కుటుంబంలో పెరిగాను. కాబట్టి మతం ఎన్నడూ నాకు గుర్తింపుగా లేదు. నా మతం మానవత్వం మాత్రమే. గుర్తింపు, సరిహద్దు ఒక వ్యక్తిని పరిమితం చేస్తుంది. నేను ఒక వ్యక్తిని మాత్రమే. దేశం నుండి గొప్ప గౌరవం అందుకున్నప్పుడు, కఠినమైన నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతుంది’ అని చెప్పుకొచ్చింది ఇటీవల పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్‌వ్యూలో. దియా మీర్జా.. క్యాన్సర్ పేషెంట్ ఎయిడ్ అసోసియేషన్, స్పస్టిస్ సొసైటీ ఆఫ్ ఇండియా వంటి పలు సంస్థలతో సంబంధం కలిగిఉంది. అంతేకాదు, హెచ్‌ఐవీ అవగాహనను వ్యాప్తి చేయడానికి విస్తృతంగా కృషి చేసింది. రాజకీయాలు.. మతం స్వతంత్రంగా వ్యవహరించే రోజు వస్తే ఒక ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నామని చెప్పగలను అంటోంది దియా. ఒక లౌకిక వాతావరణంలో పెరిగిపోయిన వ్యక్తిగా, నటి దియా మీర్జా ఒక మతపరమైన లెన్స్ ద్వారా ప్రజలను వీక్షించేటప్పుడు బాధపడుతున్నట్లు చెబుతోంది. ఏక సూత్ర సిద్ధాంతాలను ప్రచారం చేసేవారు మనల్ని నియంత్రించాలనుకుంటున్నవారు అని అంటోంది. దియాని తాజాగా జీ-5 కాశ్మీర్ వెబ్ సీరిస్ ‘కాఫీర్’లో చూడవచ్చు. ఇది ఒక పాకిస్తానీ మహిళకు సంబంధించిన జీవిత చరిత్ర. ఇందులో దియా పాకిస్తానీ మహిళగా కనిపించబోతోంది. ఓ విచిత్రమైన పరిస్థితుల ద్వారా భారతదేశానికి వచ్చిన పాకిస్తానీ మహిళ తిరిగి తన దేశానికి వెళ్లడంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఇందులో కనిపిస్తాయి. ఈ ధారావాహిక తీవ్రవాదంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ, తన న్యాయవాది (మోహిత్ రైనా)ల మధ్య ఉన్న సంబంధం చుట్టూ కథ సాగుతుంది. జమ్మూ కాశ్మీర్ రాజకీయాలు, ఆ వివాదానికి సంబంధించి మీ అవగాహన ఏమిటి? అని ప్రశ్నిస్తే- ‘ఈ ఘర్షణల వల్ల మానవజాతి ఎంతో నష్టపోతోంది. మేము శాంతి, అవకాశం, సమానత్వం గురించి మాట్లాడుతున్నాం. ఆ సమయంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ యువత ప్రాథమిక మానవ హక్కును కోల్పోయింది. ఇది కేవలం హృదయాన్ని కదిలించడం కాదు, ఎంతో తీవ్రంగా వేధించేది. ఎప్పుడైనా నేను విండో వెలుపల చూశాను. మాకు చాలా అందమైన ప్రదేశం, వాతావరణం, అందమైన పర్వతాలు కనిపించాయి. కానీ నివసించిన ప్రజల కిటికీలు మాత్రం మూసి వేయబడ్డాయి’ అని వివరించింది. భవానీ అయ్యర్ రచించిన ‘కాఫీర్’ ధారావాహికకు సోనమ్ నాయర్ దర్శకత్వం వహించారు. ఈనెల 15నుండి ప్రసారం కానుంది.