జాతీయ వార్తలు

నా పెళ్లి ఇంత ‘చల్లగా’ అవుతుందనుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చురు (రాజస్థాన్), జూన్ 12: ‘‘భానుడి ప్రతాపంతో నా పెళ్లి ఇంత ‘చల్లగా’ జరుగుతుందని అనుకోలేదు.. నేను పందిరిలో హాయిగా కూర్చొని ఉన్నాను.. నా పెళ్లికి వచ్చిన వారంతా తట్టుకొనే విధంగా నేలపై స్ప్రింక్లర్లతో నీళ్లు చల్లి చల్లబరుస్తున్నారు.. దీంతో వచ్చిన ఆహ్వానితులంతా ఎక్కడా చమటలు కక్కకుండా ఆనందంగా నా పెళ్లిని వీక్షించారు.. నాకీ ఆనందం చాలు’ అంటూ రాజస్థాన్‌లోని చురు జిల్లా కల్యాణపుర గ్రామానికి చెందిన పెళ్లికొడుకు ఆకాష్ కుమార్ ఎంతో ఉద్వేగంతో అన్నాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. రాజస్థాన్‌లో గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండలు మండిపోయాయి. జూన్ ఒకటో తేదీన ఏకంగా 50.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తమీద ఈ సమ్మర్ సీజన్‌లో మూడుసార్లు 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎక్కడా ఫ్యాన్‌లు పనిచేయడం లేదు.. ఏసీలు పనిచేయడం లేదు.. సమ్మర్ గడిచేదెలా అంటూ రాజస్థాన్ ప్రజలు తలలు పట్టుకొంటున్నారు. రోడ్డుపైకి వస్తే తడి బట్టలు తలపై కప్పుకొని రావాల్సి వస్తోంది. రైతులు, ఇతర పనులు చేసుకొనే తెల్లవారు ఝామున నాలుగు గంటలకు లేచి పనులు ముగించుకొని ఎనిమిది లోగా ఇళ్లకు చేరుకొంటున్నారంటే భానుడి తీవ్రత ఏవిధంగా ఉందో చెప్పకనే చెబుతోంది. తొమ్మిది గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో ద్రవాలనే ఎక్కువగా తీసుకొంటూ భోజనం తదితరాలను తక్కువగా తీసుకొంటున్నారు. ఐస్‌క్రీంలు, చెరకు రసాలకు ఉన్న డిమాండ్ చెప్పనక్కర్లేదు.. ఇక దుకాణందార్లయితే.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం ఐదు గంటల వరకు మూసే ఉంచుతున్నారు. ప్రజలు డీహైడ్రేషన్‌కు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకొంటున్నట్లు చురు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోజ్ శర్మ చెప్పారు. ఎండ వేడిని ఎదుర్కోవడానికి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స చేస్తున్నామని అన్నారు. ఇంత వేడిని ఎప్పుడూ చూడలేదని వృద్ధులు చెబుతున్నారు.
చిత్రం... రాజస్థాన్‌లో ఎండలు మండిపోతుండడంతో దాహార్తిని తీర్చుకుంటున్న జనం