జాతీయ వార్తలు

రాహులే మా నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: రాహుల్ గాంధీ తమ నాయకుడిగా ఉన్నారని, ప్రస్తుతం కూడా కొనసాగుతున్నారని, భవిష్యత్తులోనూ ఆయనే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి రాహుల్ సిద్ధపడిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ప్రతిపాదనకు ఎవరూ సానుకూలంగా స్పందించలేదు. మరోవైపు తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్న ఆలోచన ఏదీ లేదని రాహుల్ పలు సందర్భాల్లో పేర్కోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో సుర్జేవాలా ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీని బుధవారం కలిసిన సుర్జేవాలా ఆయనతో పలు అంశాలను చర్చించారు. హర్యానా, జమ్మూ-కాశ్మీర్, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు సమాలోచన చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ గతనెల 25న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాజీనామా అంశాన్ని రాహుల్ ప్రస్తావించిన విషయం కూడా ఈ ఇద్దరి భేటీలో చర్చకు వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 52 సీట్లు మాత్రమే సాధించడంతో రాహుల్ గాంధీ పూర్తిగా నిరాశకు గురయ్యారు. తన సారథ్యంలోనే పార్టీ విఫలమైంది కాబట్టి అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు మూకుమ్మడిగా రాహుల్ ప్రతిపాదనను తిరస్కరించారు. అధ్యక్షుడిగా రాహుల్ కొనసాగాలని వారు కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంటోనీతో సుర్జేవాలా భేటీ ఉత్కంఠ రేపింది. ఈ సమావేశం అనంతరం సుర్జేవాలా విలేఖరులతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీకి హాజరైన అహమ్మద్ పటేల్, మల్లికార్జున్ ఖర్గే, గులాం నబీ ఆజాద్, పి.చిదంబరం, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, ఆనంద్ శర్మ తదితరులంతా రాహుల్ అధ్యక్షుడిగా కొనసాగాలని పట్టుబట్టిన విషయాన్ని గుర్తుచేశారు. రాహుల్ గాంధీయే తమ అధ్యక్షుడని, భవిష్యత్తులోనూ ఆ పదవిలో ఆయనే ఉండాలని సుర్జేవాలా అన్నారు. ఇందులో మరో ఆలోచనకు తావులేదని ఆయన తేల్చిచెప్పారు.