జాతీయ వార్తలు

ఆత్మహత్యలు దురదృష్టకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆత్మహత్యలు కొనసాగడం దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ.హనుమంతరావు పేర్కొన్నారు. ఢిల్లీలో బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ స్వరాష్ట్రం సాధించుకున్నాక కూడా సామాన్య ప్రజలు, విద్యార్థులు ఆత్మహత్యలు అధికం కావడం ఆందోళన కల్గిస్తోందన్నారు. హాజీపూర్ ఘటనలోని బాధితులకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన తరువాత బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. అలాగే ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడంలో విఫలమైందని, కేవలం రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం మూలంగానే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను అందుకోవాలని అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ఆత్మహత్యలు జరగవని అందరూ భవించారు.. కాని గతంలోకంటే ఇప్పుడు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని వీహెచ్ మండిపడ్డారు.