జాతీయ వార్తలు

పార్లమెంటులో మళ్లీ ‘తలాక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: దేశంలోని ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ నుంచి విముక్తి కల్పించేందుకు సంబంధించిన బిల్లును పదిహేడవ లోక్‌సభ మొదటి సమావేశంలో ప్రతిపాదించనున్నట్లు సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటించారు. విశ్వవిద్యాలయాలను యూనిట్‌గా తీసుకుని రోస్టర్ విధానం ప్రకారం ఉపాధ్యాయుల ఎంపిక విధానాన్ని పునరుద్ధరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనివలన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రయోజనాల పరిరక్షణ జరుగుతుందని జావడేకర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రతిపాదిస్తామని మంత్రి ప్రకటించారు. జమ్మూకాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కొత్త ప్రభుత్వం మొదటి పూర్తిస్థాయి మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుక్నుట్లు ఆయన విలేఖరుల సమావేశంలో తెలిపారు. త్రిపుల్ తలాక్ బిల్లుపై గతంలో చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అభిప్రాయాలను కొత్త బిల్లులో పొందుపరిచినట్లు జావడేకర్ తెలిపారు. ‘అందరి వెంట.. అందరి అభివృద్ధి.. అందరి విశ్వాసం’ ప్రకారం ఇచ్చిన హామీ మేరకు త్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంటులో మరోసారి ప్రతిపాదిస్తున్నామని మంత్రి చెప్పారు. త్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నామన్నారు. గతంలో ఈ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించినప్పుడు ప్రతిపక్షాలు దీనిని రాజ్యసభలో ఓడించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు ఈసారి త్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో కూడా ఆమోదిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. జమ్ము సరిహద్దుల్లో నివసించే వారికి 3 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామన్నారు. 350 గ్రామాల్లోని ఐదున్నర లక్షల మందికి దీనివలన ప్రయోజనం కలుగుతుందని జావడేకర్ తెలిపారు. జమ్ము, సాంబా, కథువా జిల్లాలకు చెందినవారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారు. ఇంతవరకు ఎల్‌ఓసీ వద్ద నివసించేవారికే ఇది వర్తించేదని ఆయన తెలిపారు.
విశ్వవిద్యాలయాల్లోని ఉపాధ్యాయుల నియామకంలో పాత పద్ధతినే అవలంభించాలని నిర్ణయించినట్లు జావడేకర్ వివరించారు. ఇకమీదట విశ్వవిద్యాలయం, కాలేజీని ఒక యూనిట్‌గా తీసుకుని ఉపాధ్యాయుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం ప్రకారం డిపార్ట్‌మెంట్ లేదా సబ్జెక్ట్‌ను ఒక యూనిట్‌గా తీసుకునే విధానానికి స్వస్తిపలుకుతున్నామన్నారు. ఇకమీదట విశ్వవిద్యాలయం, కాలేజీని ఒక యూనిట్‌గా తీసుకుంటారు తప్ప విభాగాన్ని యూనిట్‌గా తీసుకోవటం జరగదని తెలిపారు. విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు ఈ నిర్ణయం వర్తిస్తుందని మంత్రి చెప్పారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ జరుగుతుందన్నారు. దీనితోపాటు ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారికి పది శాతం రిజర్వేషన్లు కూడా లభిస్తాయని జావడేకర్ ప్రకటించారు. మంత్రివర్గం నిర్ణయం ఆధారంగా త్వరలోనే వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో ఉన్న ఏడువేల పోస్టుల భర్తీ ప్రారంభం అవుతుందని తెలిపారు. 200 పాయింట్ల రోస్టర్ విధానం ప్రకారం ఈ ఎంపిక జరుగుతుందన్నారు.

చిత్రం...కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలను వెల్లడిస్తున్న ప్రకాశ్ జావడేకర్