జాతీయ వార్తలు

నిజాయితీ ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: తెలంగాణలోని కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఆర్‌సీ కుంతియా తప్పుబట్టారు. ఏఐసీసీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ గుర్తుపై గెలిచినవారిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు ‘కాంగ్రెస్ పార్టీలో ఉంటే భవిష్యత్తు కనబడటం లేదు’ అని వ్యాఖ్యానించడం అర్థరహితమన్నారు. పార్టీ టికెట్ కోసం ఎన్నికల సమయంలో ఎదురు చూసిన రోజుల్ని ఈ ఎమ్మెల్యేలు గుర్తు చేసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు నిజంగా నిజాయితీ, విశ్వాసం ఉంటే రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. ఇలాంటి అప్రజాస్వామ్య చర్యపై ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామన్నారు. సీఎల్పీ విలీనంపై కోర్టు తమకు అనుకూలంగా ఆదేశాలు ఇస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.