జాతీయ వార్తలు

ఉప రాష్ట్రపతితో రైల్వే మంత్రి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: ఆంధ్రప్రదేశ్‌కు గతంలో ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పురోగతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమీక్షించారు. ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడుతో బుధవారం కేంద్ర మంత్రులు థావర్‌చంద్ గెహ్లాట్, పీయూష్ గోయల్, స్మృతి ఇరాని, గిరిరాజ్ సింగ్ ఉపరాష్ట్రపతి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా శాఖల మంత్రులతో ఉప రాష్ట్రపతి అభివృద్ధి అంశాలపై వారితో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకుని ‘టీమ్ ఇండియా’లా ముందుకు సాగాలని కేంద్ర మంత్రులకు సూచించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రితో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చించారు. ఇటీవల కేంద్ర ఎన్నికల ముందు విశాఖపట్నం కేంద్రంగా ఏపీకి ప్రకటించిన దక్షిణ కోస్తా (సౌత్ కోస్ట్) రైల్వే జోన్ పురోగతిపై ఆయన ఆరా తీశారు. ఆ దిశలో చర్యలను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రికి సూచించారు. అలాగే వస్తు రవాణా కోసం ఉద్దేశించిన రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైల్వే లైనుతోపాటు సౌకర్యాల విషయమై ఆయన చర్చించారు. రైల్వే స్టేషన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి, సాధారణ ప్రయాణికులకు కూడా ఈ లైనును అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి రైల్వే సౌకర్యాలు విస్తరించేందుకుగాను గుంటూరు జిల్లా నంబూరు నుంచి ఏపీ-తెలంగాణ సరిహద్దులోని ఎర్రపాలెం వరకు రూ.2,800 కోట్ల వ్యయంతో 106 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ఉద్దేశించిన రైల్వే లైన్ పనులపైనా ఉప రాష్టప్రతి అరా తీశారు.