జాతీయ వార్తలు

రాజ్యసభ నాయకుడిగా తావర్ చంద్ గెహ్లాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి తావర్ చంద్ర గెహ్లాట్‌ను రాజ్యసభ నాయకుడిగా నియమించటం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్డు కులాలకు పెద్దపీట వేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ స్థానంలో గెహ్లాట్‌ను రాజ్యసభ నాయకుడిగా నియమించటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయటంలో నరేంద్ర మోదీ సమాజంలోని అన్ని వర్గాలతోపాటు సీనియర్ మంత్రులకు సైతం సముచిత ప్రాధాన్యత కల్పించారు. లోక్‌సభ నాయకుడైన నరేంద్ర మోదీ ఉపనాయకుడిగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను నియమించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను హోం మంత్రిగా నియమించిన అనంతరం ముఖ్యమైన అన్ని మంత్రివర్గ ఉపసంఘాలకు ఆయన్ని చైర్మన్‌గా నియమించటం వివాదాస్పదం కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ లోక్‌సభ ఉపనాయకుడిగా రాజ్‌నాథ్ సింగ్‌ను నియమించటం ప్రాధాన్యత సంతరించుకున్నది. రాజ్యసభలో డిప్యూటీ లీడర్ బాధ్యతలను పార్టీ కోశాధికారి, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు అప్పగించారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ప్రహ్లాద్ జోషి నియమితులు కాగా లోక్‌సభలో ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా అర్జున్‌రాం మేఘవాల్, రాజ్యసభలో ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా వి.మురళీధరన్ నియమితులయ్యారు. లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్‌గా డాక్టర్ సంజయ్ జైస్వాల్, రాజ్యసభలో చీఫ్ విప్‌గా నారాయణ్ పంచరియాను నియమించారు. లోక్‌సభలో పార్టీ కార్యదర్శిగా గణేష్ సింగ్, రాజ్యసభలో పార్టీ కార్యదర్శిగా భుపేందర్ యాదవ్, కోశాధికారిగా గోపాల్ షెట్టి నియమితులయ్యారు. పద్దెనిమిది మందిని లోక్‌సభ విప్పులుగానూ, ఆరుగురిని రాజ్యసభ విప్పులుగా నియమించారు. మంత్రులు నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, అర్జున్ ముండా, నరేంద్రసింగ్ తోమర్, స్మృతీ ఇరానీ, జువల్ ఓరాం, జేపీ నడ్డా, ఓంప్రకాశ్ మాథుర్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జావడేకర్ ప్రత్యేక ఆహ్వానితులు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఇంచార్జ్‌గా కైలాష్ విజయ వర్గీయ వ్యవహరిస్తారు. పార్లమెంటరీ పార్టీ కార్యాలయం కార్యదర్శిగా కామర్సు బాలసుబ్రమణ్యం కొనసాగుతారు.

చిత్రాలు.. రాజ్యసభ నాయకుడిగా తావర్ చంద్ గెహ్లాట్
*ఉపనాయకుడిగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌