జాతీయ వార్తలు

‘యోగా ఫర్ హార్ట్’గా ప్రపంచ యోగా దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచి, జూన్ 13: ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని ‘యోగా ఫర్ హార్ట్’గా జరుపుకోవాలని కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్యల నేపథ్యంలో యావత్ ప్రపంచం యోగా దినోత్సవాన్ని జరుపుకొంటోందని సహాయ మంత్రితో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న నాయక్ చెప్పారు. ‘యోగా అనేది ప్రజల దైనందిన జీవితంలో ఓ ముఖ్యమైన అంశంగా మారిందని.. యావత్ ప్రపంచానికే యోగాను పరిచయం చేసిన భారత్‌కు ఇది గర్వించదగ్గ పరిణామం’ అని గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. రాంచీలోని ప్రభాత్ తారా మైదాన్‌లో నిర్వహించనున్న యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరౌతున్నారని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఇంటికీ, ప్రతి ఒక్కరికీ యోగా సందేశాన్ని ఇవ్వడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని చెప్పారు. విద్య, వ్యాపార, పారిశ్రామిక సంస్థలతో పాటు కళా రంగాల్లో సైతం యోగాను ఒక విభాగంగా చేయాలన్నదే ఆయుష్ మంత్రిత్వ శాఖ లక్ష్యమని ఆయన వివరించారు. యోగా నుంచి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందడమే తమ శాఖ ఉద్దేశమన్నారు. యోగాను జనంలోకి తీసుకెళ్లడంలో సఫలీకృతులైన సంస్థలకు ‘ప్రధాన మంత్రి పురస్కారం’ ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. రెండు విభాగాల్లో నాలుగు అవార్డులు ఉంటాయనీ.. దీనికి ఇప్పటికే 200 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ నేతృత్వంలో చేస్తున్న ఏర్పాట్లను మంత్రి ప్రశంసించారు. ప్రధాన ఈవెంట్‌గా యోగా డే నిర్వహించేందుకు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదు నగరాల్లో జార్ఖండ్‌లోని రాంచీ కూడా ఒకటని మంత్రి పేర్కొన్నారు.