జాతీయ వార్తలు

సొంతంగా భారత్ స్పేస్ స్టేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: అంతరిక్షంలో సొంతంగానే స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకొనే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఇస్రో చైర్మన్ కే.శివన్ ఈ విషయాన్ని వెల్లడించారు. సొంతంగా స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల అక్కడికి వ్యోమగాములను పంపి రోదసీ పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. చంద్రయాన్-2 ప్రతిష్టాత్మక రోదసీ ప్రయోగం అనంతరం సౌర పరమైన పరిశోధనలు జరిపేందుకు సూర్యుడిపైకి కూడా ఆదిత్య అనే వ్యోమనౌకను పంపుతామని శివన్ వెల్లడించారు. 2020 ప్రథమార్థంలోనే ఈ ప్రయోగం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే, రానున్న రెండు, మూడేళ్ల వ్యవధిలో రోదసీ పరిశోధనలను మరింత విస్తృతం చేస్తామని, శుక్ర గ్రహంపైకి కూడా మరో వాహక నౌకను పంపుతామని తెలిపారు. భారత్ సొంతంగా ఏర్పాటు చేసుకోవానుకొంటున్న స్పేస్ స్టేషన్ ప్రాజెక్టు గురించి వివరించిన ఆయన 3ఇది గగన్‌యాన్ ప్రాజెక్టుకు కొనసాగింపే.. విస్తృత స్థాయిలో రోదసీ పరిశోధనలను సాగించాలంటే భారత్ సొంతంగానే స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం. ప్రస్తుతం ఉన్న స్పేస్ స్టేషన్లలో భారత్ ఎంతమాత్రం భాగస్వామి కాదు2 అని ఆయన తెలిపారు. అయితే, భారత్ ఏర్పాటు చేయబోయే స్పేస్ స్టేషన్ పరిమాణం చిన్నగానే ఉంటుందని, దీని ద్వారా సూక్ష్మస్థాయిలో గురుత్వాకర్షక ప్రభావానికి సంబంధించిన పరిశోధనలు జరుపుతామని శివన్ స్పష్టం చేశారు. ఈ స్పేస్ స్టేషన్ బలం 20 టన్నుల వరకు ఉండే అవకాశం ఉందని వెల్లడించిన ఆయన 2022 నాటికి పూర్తయ్యే తొలి గగన్‌యాన్ మిషన్ పూర్తయిన తరువాత ఈ స్పేస్‌స్టేషన్ కు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదానికి నివేదిస్తామని వెల్లడించారు. మొత్తం ఈ ప్రా జెక్టు పూర్తి కావడానికి ఐదు నుంచి ఏడు సంవత్సరాల కాల వ్యవధి పట్టే అవకాశం ఉందని చెప్పిన ఆయన ఇం దుకు ఎంత ఖర్చవుతుందన్న దానిపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ప్రస్తు తం రోదసిలో పనిచేస్తున్న అంతర్జాతీయ స్పేస్‌స్టేషన్‌ను ఐరోపా యూనియన్, అమెరికా, జపాన్, కెనడా, రష్యా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ దేశాలకు చెందిన వ్యోమగాములు వంతుల వారీగా ఐఎస్‌ఎస్‌కు వెళ్లి పరిశోధనలు సాగిస్తున్నారు.

చిత్రం... ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడుతున్న ఇస్రో చైర్మన్ కే.శివన్