జాతీయ వార్తలు

వీడని ‘వాయు’ ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్/న్యూఢిల్లీ, జూన్ 13: గత రెండు రోజులుగా గుజరాత్‌ను బెంబేలెత్తించిన వాయు తుఫాన్ రాష్ట్ర తీరాన్ని తాకే అవకాశం లేదని వాతావరణం విభాగం గురువారం స్పష్టం చేసింది. అయితే ఈ తుఫాను వాతావరణ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలను నిరంతర అప్రమత్తతలో ఉంచింది.
ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు మూడు లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ముందు జాగ్రత్త చర్యగా విమానాశ్రయాలను మూసి వేయడంతో పాటు దాదాపు 70 రైళ్లను రద్దు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం గరిష్ట స్థాయి అప్రమత్తత కొనసాగుతుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. వాయు తుఫాను అత్యంత తీవ్రంగా మారడంతో గురువారం మధ్యాహ్నమే తీరం దాటే అవకాశం ఉందని భావించారు. అయితే, తాజా వాతావరణ నివేదికను బట్టి ఈ తుఫాను కోస్తా జిల్లా అయిన గిర్ సోమ్‌నాథ్‌లోని వెరవాల్‌కు 150 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తుఫాను గతి స్వల్పంగా మారిందని, అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ వాతావరణ కేంద్ర అధ్యయన డైరెక్టర్ మహంతి తెలిపారు. అయితే సవ్‌రాష్ట్ర తీరానికి కాకుండా ఈ తుఫాను ప్రభావం గిర్ సోమ్‌నాథ్, జునాగఢ్, పోరుబందర్, దేవభూమి ద్వారకా అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన డీయూపై ఉండవచ్చునని మహంతి తెలిపారు.
తుఫాను మొత్తం తీవ్రత గుజరాత్‌పై ఉండకపోయినా సగానికి పైగా దీని ప్రభావం తీర ప్రాంతాలపై ఉండవచ్చునని వెల్లడించారు. దీనివల్ల తీవ్రస్థాయి నష్టానికి ఆస్కారం ఉందని అందుకే అన్ని వ్యవస్థలను అప్రమత్తంగా ఉంచామని అన్నారు. పశ్చిమ దిశగా తుఫాను గమనం మొదలైందని వాతావరణ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ దేవేంద్ర ప్రదాన్ తెలిపారు. ఈ తుఫాను గుజరాత్ తీరానికి సమాంతరంగా పయనించే అవకాశం ఉందన్నారు. దీని గతి తప్పినప్పటికీ ప్రమాద తీవ్రత తగ్గలేదని తీర ప్రాంతాలపై దీని ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. దాదాపు 9 వందల కిలో మీటర్ల మేర ఇది విస్తరించినందుకు దీని ప్రభావం వల్ల తీవ్ర స్థాయిలో గాలులు, సముద్ర కెరటాలు ఎగిసిపడటం వంటివి జరుగుతున్నాయన్నారు. తుఫాను తీరం దాటడం కంటే కూడా అంతకు ముందు వరకు దానివల్ల కలిగిన నష్టం ఏమిటన్నదే ముఖ్యమని, దీని దృష్ట్యానే రానున్న 48 గంటల పాటు తీర ప్రాంతాలన్నింటినీ ప్రభుత్వం అప్రమత్తం చేసిందన్నారు.

చిత్రం... గిరి సోమ్‌నాథ్ జిల్లాలో ఆలయ గోడలను తాకుతున్న భారీ కెరటాలు