జాతీయ వార్తలు

మమత క్షమాపణ చెప్పాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత్తా, జూన్ 14: గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న పశ్చిమ బెంగాల్ వైద్యులు తమ ఆందోళన విరమించడానికి షరతులు విధించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు మొత్తం ఆరు డిమాండ్లను తెరపైకి తెచ్చారు. డాక్టర్ల సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సర్వీసులు నిలిచిపోయే పరిస్థితి తలెత్తడంతో సమస్య తక్షణ పరిష్కారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి పెరిగింది. ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో గురువారం మాట్లాడిన మమతా బెనర్జీ తన వ్యాఖ్యల ద్వారా తమకు తీవ్ర మనస్థాపం కలిగించారని, ఇందు కు ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని జూనియర్ డాక్టర్ల సంయుక్త ఫోరం ప్రతినిధి అరిందం దత్తా స్పష్టం చేశారు. వైద్య కళాశాలలకు ఇతరులు ప్రవేశించి అస్తవ్యస్థ పరిస్థితిని సృష్టించారని, అలాగే వైద్యుల ఆందోళన వెనుక బీజేపీ, సీపీఎం హస్తం ఉందని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఆందోళన చేస్తున్న వైద్యుల్లో మరింత ఆందోళన కలిగించింది. తమ షరతుల్లో భాగంగా క్షతగాత్ర వైద్యులను ఆసుపత్రికి వెళ్ళి మమతా బెనర్జీ పరామర్శించాలని, వీరిపై జరిగిన ఖండిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన జారీ చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పలు ఆసుపత్రుల్లో వైద్యులకు రక్షణ కల్పించడంలో పోలీసుల వైఫల్యాన్ని తప్పుపట్టిన వైద్యులు దీనిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశా రు. ఆసుపత్రిలో మరణించిన ఓ రోగి బంధువు లు చేసిన దాడిలో ఇద్దరు జూనియర్ డాక్టర్లు తీవ్రంగా గాయపడిన విషయాన్ని గుర్తు చేశా రు. తమపై దాడి చేసిన వారిపై ఏ రకమైన చర్య లు తీసుకున్నారో వివరాలు వెల్లడించాలని దత్తా డిమాండ్ చేశారు.
అలాగే జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులపై దాఖలు చేసిన తప్పుడు కేసులు, అభియోగాలను బేషరుతగా వెనక్కి తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అన్ని చోట్ల సాయుధ బలగాలను మోహరించాలని స్పష్టం చేశారు.
క్షమాపణ చెబితే తప్పు లేదు: అపర్ణాసేన్
సమ్మె చేస్తున్న వైద్యుల విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దురుసుగా వ్యవహరించి ఉండకూడదని ప్రఖ్యాత నటి అపర్ణాసేన్ అన్నారు. వీరికి బెదిరింపులు జారీ చేసినందుకు మమతా బెనర్జీ క్షమాపణ చెప్పాలని, పరిస్థితిని అదుపు చేసే క్రమంలో క్షమాపణ చెప్పడం తప్పేది కాదన్నారు.