జాతీయ వార్తలు

మహిళలకు మెట్రోలో ఉచిత ప్రయాణం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: దేశ రాజధాని ఢిల్లీ మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రతిపాదనను మెట్రో మాజీ చీఫ్ శ్రీధరన్ తప్పుపట్టారు. ఆప్ ప్రభుత్వం తీసుకొన్న ఇటువంటి ప్రతిపాదన ‘ఆందోళనకర పరిణామం’గా అభివర్ణిస్తూ ఇటువంటి చర్యలను ఆమోదించవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శ్రీధరన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలపై అంత ప్రేమ ఉంటే మరోరకంగా వారికి సహకరించాలని ప్రదానికి రాసిన లేఖలో ‘మెట్రో మేన్’ శ్రీధరన్ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని కచ్చితంగా జోక్యం చేసుకోవాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మాజీ చీఫ్ అయిన శ్రధరన్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో 2002లో ప్రారంభమైన మొదటి సెక్షన్‌లోనే ఏ ఒక్కరికీ ఉచిత ప్రయాణం అనేది కల్పించకూడదని నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన చెప్పారు. మొదటి సెక్షన్ ప్రారంభ సమయంలో అప్పటి ప్రధాన మంత్రి దివంగత వాజపేయి సైతం టికెట్‌ను కొనుగోలు చేసి ప్రయాణించారని శ్రీధరన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. మహిళా ప్రయాణికులపై అంత గౌరవం ఉంటే వారి టికెట్లను ప్రభుత్వమే కొనుగోలు చేయచ్చు కదా? అని ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు మెట్రో రైలులో ఉచిత ప్రయాణం సౌకర్యం ప్రకటించిందనీ.. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న మెట్రో రైలు వ్యవస్థకు ‘ఆందోళనకర పరిణామం’ అని శ్రీధరన్ చెప్పారు. దీనివల్ల ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఆదాయం గణనీయంగా పడిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.