జాతీయ వార్తలు

‘సైడ్ బిజినెస్’ చేస్తే ఇంటికే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, జూన్ 14: ప్రభుత్వ ఉద్యోగుల్లో కనీసం 30 శాతం మంది ప్రైవేటుగా వ్యాపారాలు చేసుకొంటున్నారనీ.. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని గోవా కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి రోషన్ కౌంటే శుక్రవారం స్పష్టం చేశారు. ఇటువంటి వ్యాపారాలు చేసుకొనే ఇంటికి సాగనంపుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూనే.. ‘ఇది ఒక రకంగా మంచి పరిణామమే.. దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని’ చురకలు అంటించారు. ఇలాంటి ఉద్యోగులు విధి నిర్వహణలో కొంతమేర అలక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోందని.. ఇది ఎంతమాత్రం హర్షించదగ్గది కాదని అన్నారు. అయితే, ఉద్యోగానికి రాజీనామా చేసి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని మంత్రి ఉద్యోగులకు హితవు పలికారు. ఇలా ప్రైవేటు వ్యాపారాలు చేసే వ్యాపారులను గుర్తించేందుకు టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నట్లు మంత్రి చెప్పారు.