జాతీయ వార్తలు

పరిశ్రమల స్థాపనకు ఏపీ బెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 14: పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్‌లో అనుకూలమైన వాతావరణం, మానవ వనరులు, కోస్టల్ కారిడార్, సాంకేతిక నైపుణ్యత ఉందని కేంద్ర రైల్వే, వాణిజ్య పరిశ్రమల శాఖామంత్రి పీయూష్‌గోయాల్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం తిరుపతిలోని గ్రాండ్‌రిడ్జ్ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించి పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో యువ పారిశ్రామికవేత్తలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. రానున్న రోజల్లో వ్యవసాయ అనుబంధ రంగాలు, సోలార్ ఆధారిత పరిశ్రమల స్థాపనకు మంచి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో గల నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ కేంద్రప్రభుత్వం పూర్తి సహాయ సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందిస్తుందన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపై ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న దీర్ఘకాలిక పెండింగ్ అంశాలపై దృష్టి సారిస్తుందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో నూతన ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత తిరుపతిలో మొదట పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే విషయమై చర్చించాలన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపన ద్వారా ఎక్కువమందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు కేంద్రప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అనంతపురంలో కియా మోటార్స్ వద్ద అప్రోచ్ రోడ్డు, రైల్వే అండర్‌బ్రిడ్జ్‌ను మరింత వెడల్పు, ఎత్తు పెంచాలని కియోమోటార్స్ ఎండీ కేంద్రమంత్రిని అభ్యర్థించగా 40 రోజుల్లోపు అండర్‌బ్రిడ్జిని వెడల్పు చేసి ఎత్తు పెంచి పనులు పూర్తి చేయాలని రైల్వే అధికారులను కేంద్రమంత్రి ఆదేశించారు. ఈవెహికల్స్ మీద త్వరలో ప్రభుత్వ పాలసీని ప్రకటిస్తామని, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి యాంటీ డంపింగ్ డ్యూటీ విధించే విషయమై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దీని ద్వారా ఆటోమొబైల్ ఉత్పత్తుల రంగానికి మేలు చేకూర్చే విధంగా విధానాన్ని ప్రకటిస్తామన్నారు. నూతనంగా ఏర్పేడులో ఏర్పాటు చేయబోతున్న రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం తెలిపారు. ఎం ఎస్ ఎం ఈ ఎంటర్‌ప్రైజెస్ , ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు తక్కువ వడ్డీరేటుతో రుణాలు ఇవ్వడానికి కేంద్రప్రభుత్వం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానంలో ఉందని, ఈ స్థానాన్ని ఈ విధంగా కొనసాగించే విధంగా కృషి చేయాలన్నారు. దేశ సమగ్రాభివృద్ధికి జిల్లాల వారీగా ర్యాంకులను వచ్చే సంవత్సరంలో ప్రకటించనున్నామన్నారు. కేంద్రప్రభుత్వం ఎం ఎస్ ఎం ఈ లకు అందిస్తున్న మార్కెటింగ్ సౌకర్యం ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా సంవత్సరానికి 25వేల కోట్ల మార్కెటింగ్ సౌకర్యం కల్పించామన్నారు. భౌగోళికంగా, సామాజికంగా అతిపెద్ద దేశమైన భారతదేశంలో జీ ఎస్టీని విజయవంతంగతా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం పరిశ్రమల స్థాపన ద్వారా ఎక్కువమందికి ఉపాధి కల్పన దిశగా పనిచేస్తున్నదని, అవినీతికి తావు లేకుండా పారదర్శకమైన పాలనను అందిస్తూ ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌ను అమలు చేస్తామన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ కంపెనీల నుండి వచ్చిన పారిశ్రామిక వేత్తలు, ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలపై వారు పొందిన ప్రయోజనాలను, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అందించాల్సిన ప్రోత్సాహకాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో డిపీఐఐటీ సెక్రటరీ అనిల్ అగర్వాల్, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల వౌలిక సదుపాయాలు, పట్టుబడుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ రజిత్ భార్గవ, ఇండస్ట్రీస్ కమిషనర్ సిద్దార్థజైన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, జేసీ గిరీషా, తిరుపతి మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు, తిరుపతి సబ్‌కలెక్టర్ డాక్టర్ మహేష్‌కుమార్; అమరరాజా బ్యాటరీస్ చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు, శ్రీసిటీ ఎండీ రవిసన్నారెడ్డి, రోబోటిక్ సంస్థ నుండి బాలసుబ్రమణ్యం, వివిధ కంపెనీలకు చెందిన సి ఈవోలు, బీజేపీ ప్రతినిధులు భానుప్రకాష్‌రెడ్డి, శాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి రైల్వేస్టేషన్ గోల్డ్ రేటింగ్ సర్ట్ఫికెట్ ప్రదానం
ఇదిలావుండగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్‌లోని వసతుల కల్పన, ఉత్తమ సేవలకు గ్రీన్ బిల్డింగ్ కార్పొరేషన్ అమరావతి చాప్టర్ వారు ప్రకటించడం అభినందనీయమన్నారు. దీన్ని నేడు తన చేతులు మీదుగా గోల్డ్ రేటింగ్ సర్ట్ఫికెట్, మొమెంటో తిరుపతి రైల్వేస్టేషన్‌కు ప్రదానం చేయడం సంతోషించదగ్గ విషయమని కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయల్ అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక గ్రాండ్ రిడ్జ్ హోటల్‌లో ఈ అవార్డును సౌత్ సెంట్రల్‌రైల్వే అధికారులకు కేంద్రమంత్రి అందించారు.