జాతీయ వార్తలు

ఊపిరాడక ఏడుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, జూన్ 15: గుజరాత్‌లోని ఒక హోటల్‌లో మురుగు నీటి కాలువలను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక నలుగురు పారిశుద్ధ్య సిబ్బంది సహా ఏడుగురు మృతి చెందారు. వడోదర జిల్లాలో శుక్రవారం అర్ధ రాత్రి తరువాత ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. దభోయి తహసీల్ పరిధిలోని ఫర్టికుయి గ్రామంలో గల దర్శన్ హోటల్ ఆవరణలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు హోటల్ సిబ్బంది కూడా మృతి చెందారని పోలీసులు చెప్పారు. ‘మురుగు నీటిని శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు తాడు సాయంతో మ్యాన్‌హోల్‌లోకి దిగారు. ఒక కార్మికుడు మ్యాన్‌హోల్ నుంచి బయటికి రాకపోవడంతో, ఏమయిందో తెలుసుకోవడానికి మిగతా వారు కూడా అందులోకి దిగారు. అయితే, ఊపిరాడకపోవడం వల్ల వారంతా మృతి చెందారు’ అని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ కిరణ్ జవేరి ఒక వార్తాసంస్థకు తెలిపారు. ‘మేము సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాం. వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌లోని అగ్నిమాపక శాఖకు చెందిన సిబ్బంది, దభోయి మున్సిపాలిటీ నుంచి వచ్చిన సిబ్బంది కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మూడు గంటల పాటు శ్రమించి మృతి చెందిన వారి మృతదేహాలను బయటకు తీశారు’ అని ఆయన వివరించారు. పోస్టుమార్టం అనంతరం మృతుల బంధువులకు మృతదేహాలను అప్పగించారు. హోటల్ యజమాని హసన్ అబ్బాస్ ఇస్మాయిల్ బొరానియా పరారయ్యారు. దభోయి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే శైలేశ్ మెహతా ఒక వార్తాసంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ దగ్గరలోని తువావి గ్రామానికి చెందిన నలుగురు పారిశుద్ధ్య కార్మికులను మురుగు నీటి కాలువలను శుభ్రం చేయడానికి కూలీకి తీసుకొచ్చారని వివరించారు. కార్మికుల భద్రతను ఏమాత్రం పట్టించుకోలేదని ఈ సంఘటన వెల్లడిస్తోందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం అర్ధ రాత్రి దాటిన తరువాత సుమారు 12.30 గంటలకు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, గుజరాత్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. నాలుగు లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. హోటల్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులను ఆదేశించినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.