జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా సంప్రదాయ వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: ఆధునిక యుగంలో ప్రజల జీవన స్థితిగతులు మారుతున్నాయి. ఆహారపు అలవాట్లు, పబ్ కల్చర్, చేసే ఉద్యోగాలు, నిద్ర లేమి, శబ్ధ, వాయు కాలుష్యం వంటి అనేకానేక కారణాలతో వైద్యులకు అంతు చిక్కని కొత్త వ్యాధులు వస్తున్నాయి. ఇప్పటికే క్యాన్సర్ మహామ్మారి భయకంపితులను చేస్తున్నది.
వయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్ భారిన పడుతున్నారు. ఆల్లోపతి మందులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్. ఇలా ఆరోగ్యం దెబ్బతింటున్నదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ రెండు అడుగులు ముందుకేసి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించింది. దేశ వ్యాప్తంగా 12,500 వైద్య, వెల్‌నెస్ సెంటర్లలో సాంప్రదాయ వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. దీర్ఘకాల వ్యాధులతో సతమతమవుతున్న వారికి మెరుగైన చికిత్స అందించి, ఉపశమనం కలిగించేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకాల కింద సాంప్రదాయ వైద్య సేవలు అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందరికీ ఆరోగ్యం అందించడమే కేంద్రం లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత లేకుండా చూడడం, ఆయుష్ డాక్టర్లను నియమించడం వంటివి చేపట్టనున్నట్లు తెలిపారు. 2016 సంవత్సరంలో పైలట్ ప్రాజెక్టుగా రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో, గుజరాత్‌లోని సురేంద్ర నగర్ జిల్లాలో, బీహార్‌లోని గయ జిల్లాలో ఆయుర్వేదిక్ మందులను అందుబాటులోకి తేవడం జరిగిందని, యోగలో శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన వివరించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) యాంటీ-డయాబెటిక్ డ్రగ్ బీజీఆర్-34ను తీసుకుని వచ్చిందని ఉదహరించారు.