జాతీయ వార్తలు

సమస్యను పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: కొలీజియం వ్యవస్థ పనితీరుపై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జె.చలమేశ్వర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో ఆ సమస్యను తాము పరిష్కరిస్తామని ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్ శనివారం స్పష్టం చేశారు. పనితీరు పారదర్శకంగా లేదన్న కారణంతో కొలీజియం సమావేశాల్లో పాల్గొనేందుకు జస్టిస్ చలమేశ్వర్ నిరాకరించడం గురించి అడిగి తెలుసుకున్న తర్వాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిస్పందిస్తూ, ఈ సమస్యను పరిష్కరిస్తామని పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. సుప్రీం కోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తుల్లో ఐదవ వారైన చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని జస్టిస్ ఎఆర్.దవే, జస్టిస్ జెఎస్.కేహార్, జస్టిస్ దీపక్ మిశ్రా తదితర ఐదుగురు సభ్యులతో కూడిన కొలీజియంలో సభ్యునిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే గురువారం కొలీజియం సమావేశానికి జస్టిస్ చలమేశ్వర్ హాజరు కాలేదు. అంతేకాకుండా కొలీజియం సమావేశాల్లో పాల్గొనడం తనకు ఇష్టం లేదని, కొలీజియం పనితీరు పారదర్శకంగా లేకపోవడంతో పాటు పలు ఇతర అంశాలే కారణమని పేర్కొంటూ ఆయన ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికే లేఖ రాశారు. జస్టిస్ చలమేశ్వర్ హాజరు కాకపోవడంతో గురువారం కొలీజియం సమావేశాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.