జాతీయ వార్తలు

బీహార్‌లో మరో నలుగురు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా/ముజఫర్‌పూర్, జూన్ 15: బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో హైపోగ్లైసిమియా వ్యాధితో మరో నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 67కు పెరిగింది. మరణించిన వారంతా 10 సంవత్సరాల లోపు వయస్సుగల వారేనని అధికారులు తెలిపారు. రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడం కారణంగా ఇక్కడి శ్రీకృష్ణ వైద్య కళాశాల-ఆసుపత్రిలో, కేజ్రీవాల్ ఆసుపత్రిలో ఈ చిన్నారులు చికిత్స పొందుతూ మరణించినట్లు చెప్పారు. కేజ్రీవాల్ ఆసుపత్రిని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నది. శనివారం నలుగురు చిన్నారులు శ్రీకృష్ణ వైద్య కళాశాల-ఆసుపత్రిలో మరణించినట్లు ముజఫర్‌పూర్ జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు శ్రీ కృష్ణ వైద్య కళాశాల-ఆసుపత్రిలో 197 మంది చిన్నారులు ఈ వ్యాధి అనుమానంతో చేరారని తెలిపింది. కేజ్రీవాల్ ఆసుపత్రిలో 91 మంది చిన్నారులు చేరినట్లు పేర్కొంది. వీరిలో ఎక్కువ మందికి హైపోగ్లైసిమియా ఉన్నట్లు పరీక్షల ద్వారా తెలిసింది. ఇదిలాఉండగా ఈ రెండు ఆసుపత్రుల్లో మరో ఆరుగురు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. ఇలాఉండగా బీహార్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఇటీవల కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిత్యానంద రాయ్ రాష్ట్రానికి తొలి దఫా చేరుకోగానే, తన సన్మాన కార్యక్రమాలను రద్దు చేసుకుని నేరుగా ముజఫర్‌పూర్‌లోని ఈ ఆసుపత్రులను సందర్శించి కుటుంబ సభ్యులను కలిసి వారికి మనోధైర్యం చెప్పారు. చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో చర్చించారు.

చిత్రం... ముజఫర్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు