జాతీయ వార్తలు

వైద్యుల రక్షణకు చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: వైద్యులపై తరచూ జరుగుతున్న దాడుల నేపథ్యంలో వారికి తగిన రక్షణ కల్పించేందుకు వీలుగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
పశ్చిమబెంగాల్‌లో డాక్టర్లపై దాడులను నిరసిస్తూ చేపట్టిన ఆందోళన తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి తీవ్రంగా స్పందించారు. ఇకముందు వైద్యులపై ఎవరైనా దాడులకు దిగితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆయన సుదీర్ఘమైన లేఖను రాశారు. ఈమేరకు ప్రొటెక్షన్ ఆఫ్ మెడికల్ సర్వీస్ పర్సన్స్ అండ్ మెడికల్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్స్ అందించిన ముసాయిదా కాపీను ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య శాఖ మంత్రి పంపిస్తూ వైద్యులపై ఎలాంటి దాడులకు ఉపక్రమించినా కఠిన వైఖరి అవలంబించాలని కోరారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గత నాలుగురోజులుగా దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్పందించిన కేంద్ర మంత్రి శుక్రవారంనాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సైతం ఒక లేఖను రాశారు. ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది ఎలాంటి దాడి, హింసాకాండ, ఆస్తుల విధ్వంసానికి పాల్పడినా అలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించేందుకు వీలుగా తగిన చట్టాన్ని రూపొందించాలని కోరారు.