జాతీయ వార్తలు

తక్షణమే విధులకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 15: తక్షణమే సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. గత ఐదు రోజులుగా డాక్టర్ల సమ్మె వల్ల రాష్టవ్య్రాప్తంగా వైద్యసేవలు స్తంభించినా కూడా ఎస్మా చట్టాన్ని తాను ప్రయోగించలేదని ఆమె స్పష్టం చేశారు. ‘ప్రభుత్వానికి ఎన్నో చట్టాలున్నాయి. కానీ వాటిని ప్రయోగించాలన్న ఉద్దేశ్యం మాకు లేదు’ అని మమత స్పష్టం చేశారు. అయితే, తమకు బేషరతుగా క్షమాపణ చెబితే తప్ప, చర్చలకు వచ్చేది లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. సమ్మె ఐదోరోజుకు చేరుకున్న నేపథ్యంలో సమస్య పరిష్కారంలో భాగంగా తాను మమత చేసిన చర్చల ప్రయత్నాలు విఫలం కావడంతో ఆమె మీడియాతో మాట్లాడారు. జూనియర్ డాక్టర్లపై చర్య తీసుకోవడం ద్వారా వారి కెరీర్‌కు విఘాతం కలిగించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని ఆమె తెలిపారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వైద్యులు హాజరుకాకపోవడంతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మమతా బెనర్జీ మాట్లాడారు. అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం (ఎస్మా) పరిధిలోకి వచ్చే సర్వీసులకు చెందిన ఉద్యోగులకు సమ్మె చేసే అవకాశం ఉండదని గుర్తు చేసిన మమత ఇతర రాష్ట్రాల్లో సమ్మె దిగిన వైద్యులపై ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను ఉదహరించారు. అయితే, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మాత్రం వైద్యులపై ఎలాంటి కఠినచర్యలకు దిగలేదని, అందుకు కారణం వారి కెరీర్‌కు ఇబ్బంది కలుగకూడదన్న ఉద్దేశమని వివరించారు. ఇప్పటివరకు వైద్యులు చేసిన డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం ఆమోదించిందని, మరికొన్ని డిమాండ్లను నెరవేర్చడానికి సిద్ధంగా ఉందని ఆమె అన్నారు. అయితే, ముందుకు వీరంతా తప్పనిసరిగా విధులకు హాజరై తీరాలని ఆమె ఉద్ఘాటించారు. ‘శుక్రవారంనాడు జూనియర్ డాక్టర్ల కోసం ఐదు గంటలపాటు ఎదురుచూశాను. ఇవాళ కూడా నా ఇతర కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని వారి కోసం వేచిచూశాను. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత వైద్యులపై ఎంతైనా ఉంది’ అని మమత బెనర్జీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు సామూహిక రాజీనామాలు ఎంతమాత్రం చట్టబద్ధంగా చెల్లవని ఆమె స్పష్టం చేశారు. ‘ముఖ్యమంత్రిగా నేను అసమర్థులానినని జూనియర్ డాక్టర్లు భావిస్తే వారు గవర్నర్‌ను గానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినిగానీ లేదా పోలీస్ కమిషనర్‌ను గానీ సంప్రదించవచ్చు’ అని ఆమె అన్నారు.