జాతీయ వార్తలు

త్వరలో మంత్రివర్గ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూర్, జూన్ 15: ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించినప్పటికీ కర్నాటకలోని అధికార కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో తీవ్ర స్థాయి అసంతృప్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం మాట్లాడిన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు ‘త్వరలోనే మంత్రి వర్గాన్ని పునర్‌వ్యవస్థీకరిస్తాం. ఇందులో భాగంగా కొందరు సీనియర్ నేతలను సంప్రదిస్తాం’ అని వెల్లడించారు. 13నెలలు అధికార సంకీర్ణ ప్రభుత్వ మనుగడను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్.శంకర్, హెచ్. నగేష్ అనే ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కుమారస్వామి మంత్రి పదవులు కట్టబెట్టారు. అయితే ఈ పదవులను ఆశించిన అనేక మంది కాంగ్రెస్ నేతలకు ఈ పరిణామం తీవ్ర మనస్థాపాన్ని కలిగించింది. సంకీర్ణ ప్రభుత్వంలో తమ పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉన్నప్పటికీ తమకు మంత్రి పదవులు కట్టుబెట్టకుండా ఇండిపెండెంట్లకు అవకాశం ఇవ్వకపోవడంపై కాం గ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే శుక్రవారం జరిగిన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి వీరు ఎవరూ హాజరుకాలేదు. ఎమ్మెల్యేలను సంతృప్తి పరిచేందుకు, మంత్రి పదవులు రాని వారికి పదవులు ఇచ్చేందుకు 6 నుంచి 8 నెల ల వ్యవధిలోనే రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్‌వ్యవస్థకరిస్తామని పీసీసీ నేత గుండూరావు తెలిపారు. ఆ సందర్భంగా పదవులు రానివారికి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తామన్నారు. అయితే మంత్రుల పనితీరు, బాధ్యతల నిర్వహణలో వారి సామర్థ్యాన్ని విశే్లషించిన మేరకే పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందని తెలిపారు.