జాతీయ వార్తలు

సమ్మె, అల్లర్లపై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: పశ్చిమ బెంగాల్‌లో వైద్యుల సమ్మె, రాజకీయ అల్లర్లపై తమకు వెంటనే వేర్వేరుగా నివేదికలు అందజేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. వైద్యుల సమ్మె, నాలుగేళ్ళుగా రాష్ట్రంలో రాజకీయ హత్యలు, తరచూ హింసాకాండ వంటి ఘటనల పట్ల కేంద్రం ఆగ్రహంగా ఉంది. వీటిని అరికట్టడంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ల సమ్మెపై నివేదిక సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో జరిగిన రాజకీయ హింసాకాండ, సుమారు 160 మంది మరణించిన ఘటనలపై సంపూర్ణమైన నివేదిక అందజేయాలని ఆదేశించింది. ఎన్నికల సమయంలోగానీ, ఇతర సమయాల్లోగానీ రాజకీయ అల్లర్లు తరచూ జరుగుతున్నాయని, వీటి సంఖ్య క్రమేణా పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదని వ్యాఖ్యానించింది. 2016 సంవత్సరంలో రాజకీయ అల్లర్ల ఘటనలు 509 కాగా, 2018 సంవత్సరం నాటికి 1,035కి పెరిగిందని తెలిపింది. ఇక ప్రస్తుతం అంటే 2019లో ఇప్పటికే 773 ఘటనలు జరిగాయని పేర్కొంది. అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 2016 సంవత్సరంలో 36 కాగా 2018 నాటికి 96కు పెరిగిందని తెలిపింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే 26 మంది మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. అల్లర్లను అదుపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమిటో తెలియజేస్తూ సమగ్ర నివేదిక అందజేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా డాక్టర్ల సమ్మెపైనా వెంటనే నివేదిక అందజేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
*
పశ్చిమ బెంగాల్‌లో సమ్మెకు దిగిన డాక్టర్లకు మద్దతుగా దేశ వ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లోని డాక్టర్లు సైతం విధులను వదిలి ఆందోళన బాటపట్టారు. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వద్ద చికిత్స అందక నానా అవస్థలు పడుతున్న రోగులు, వారి బంధువులు.